Ap is called with new brand name sunrise country by chandrababu naidu

AP is called with new brand name Sunrise Country, Chandrababu Naidu releases white paper on Industries, Chandrababu calls AP as Sunrise Country

AP is called with new brand name Sunrise Country by Chandrababu Naidu

బాబు కాఫీ షాప్!

Posted: 07/12/2014 01:55 PM IST
Ap is called with new brand name sunrise country by chandrababu naidu

మొన్నటిదాకా స్వర్ణాంధ్రప్రదేశ్ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న దాన్ని సన్ రైజ్ కంట్రీ అని పిలవటం ప్రారంభించారు.  సన్ రైజ్ అనేది నెస్ల్ సంస్థవారి కాఫీలలో ఒక బ్రాండ్.  దాన్ని రాష్ట్రానికి బ్రాండ్ నేమ్ గా మార్చి కాఫీ షాప్ ని చేస్తున్నారా అంటూ వెంటనే విమర్శలు వెల్లువెత్తాయి.  అంతే కాదు కంట్రీ ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు.  అయితే తెలుగు దేశం పార్టీ లో కూడా దేశం పేరుని వాడుకున్నారు కదా అలాగే దాన్ని ఇంగ్లీష్ లో కంట్రీ అని పిలుస్తున్నారు చంద్రబాబు.  కేరళ రాష్ట్రం గాడ్స్ ఓన్ కంట్రీ అని అనటంలే.

పరిశ్రమలు, నిర్మాణాలు, ఉద్యోగకల్పనల మీద శుక్రవారం శ్వేతపత్రాన్ని విడుదలచేసిన చంద్రబాబు నాయుడు, తాను కష్టపడి సాధించిన బ్రాండ్ ఇమేజ్ ని కాంగ్రెస్ తన 10 సంవత్సరాల పాలనలో పాడు చేసిందని, ఫలితంగా పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు.  

ఏ విషయాన్నైనా గణాంకాల్లో వివరించే అలవాటున్న చంద్రబాబు నాయుడు 1995 లో 22 వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని 2004 లో మూడవ స్థానానికి తీసుకునివచ్చానని, ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో 64000 లఘు, మధ్యతరగతి పరిశ్రమలు మూతబడ్డాయని, తద్వారా 12000 కోట్ల పెట్టుబడిని ఎన్ పి ఏ చెయ్యటం, 230000 మంది ఉపాధిని కోల్పోవటం జరిగిందని తెలియజేసారు.  రెండు లక్షల ఎకరాల భూమిని అవినీతిలో డబ్బు కూడబెట్టటం కోసం కేటాయించటం జరిగిందని కూడా ఆయన అన్నారు.  మళ్లీ ఇప్పుడు సింగపూర్, మలేషియా, జపాన్ నుంచి పెట్టుబడులు పెట్టటానికి ముందుకు వస్తున్నారని, అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటి కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వనించటం జరుగుతోందని అన్నారు.  

వ్యాపారాభివృద్ధికి దోహదం చేసే ప్రణాళికలు, అందుకు తగ్గ వాతావరణాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని చెప్పిన చంద్రబాబు, సంవత్సరానికి రాష్ట్రానికి 44000 కోట్ల ఆదాయం వచ్చే విధంగా పారిశ్రామికాభివృద్ధిని చేస్తామని, అందుకు పరిశ్రమలు, ఐటి, వ్యవసాయం, వ్యాపారం, పర్యాటక రంగం, హోటల్ పరిశ్రమలు దోహదం చేస్తాయని అన్నారు.  

విశాఖపట్నాన్ని పరిశ్రమలకు, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగాను, అనంతపూర్ చిత్తూర్ జిల్లాలను ఉద్యానవనాభివృద్ధి కేంద్రాలుగాను తీర్చిదిద్దుతూ, రాజమండ్రిలో పెట్రోలియం విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లాలో మెరైన్ విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతమని చంద్రబాబు అన్నారు.   

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, ఉదయించే సూర్యుడిలా వెలుగులీనుతూ రాష్ట్రం ముందుకెళ్తుందన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ కంట్రీ అని ముద్దుగా పిలిచారు.  

ఇది చూసి, బంగారం ధర విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో స్వర్ణాంధ్ర ప్రదేశ్ అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, ప్రకృతి ఫ్రీగా అందించే ఉదయ కిరణాలను ఉపయోగించుకుంటూ సన్ రైజ్ అంటే సాధించటానికి ఎక్కువ వీలవుతుందని పేరు మార్చారేమో అంటూ కొందరు విమర్శలు చేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles