Former pm manmohan singh comments on union budget

Former PM manmohan singh comments on union budget, manmohan singh comments on narendra modi, manmohan singh with narendra modi, narendra modi with manmohan singh, manmohan singh fires on narendra modi, manmohan singh comments on union budget, union budget 2014-15, union budget news

Former PM manmohan singh comments on union budget

మోడీపై ప్రతీకారం తీర్చుకున్న మన్మోహన్!

Posted: 07/11/2014 03:46 PM IST
Former pm manmohan singh comments on union budget

(Image source from: Former PM manmohan singh comments on union budget)

యూపీఏ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు పదేళ్లవరకు ప్రధానమంత్రి పదవిని చేపట్టి, మౌనవ్రతం పాటించిన ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్... చాలాకాలం తరువాత పెదవి విప్పారు. ఆయన అధికారంలో వున్నప్పుడు దేశాభివృద్ధికి ఎటువంటి పద్ధతులను అనుసరించాడో తెలియదు కానీ... ప్రస్తుతం అధికారంలో వున్న ఎన్డీయే ప్రభుత్వం విడుదల చేసిన కేంద్ర బడ్జెట్ సరిగ్గా లేదని ఆయన వ్యాఖ్యానించాడు. ప్రధానిగా వున్నప్పుడు ఎప్పుడూ మౌనవ్రతాన్ని పాటించిన మన్మోహన్... కేంద్ర బడ్జెట్ పై తీవ్రంగా విమర్శించడం ఆసక్తికరంగా మారింది.

‘‘మోడీ సర్కార్ విడుదల చేసిన కేంద్ర బడ్జెట్ కు దశాదిశాలేద’’ని ఆయన వ్యాఖ్యానించాడు. ‘‘ప్రతిపక్ష హోదాలో వున్నప్పుడు మామీద విరుచుకుపడిన మోడీ.. ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలపై ఎవరు సమాధానమిస్తారు’’ అని ఆయన ప్రశ్నించారు. ఈయనతోపాటు కాంగ్రెస్ పార్టీలో వున్న అగ్రనేతలు కూడా ఈ కేంద్ర బడ్జెట్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ యువనేత కేంద్ర బడ్జెట్ ను లాండ్రీ లిస్ట్ లా వుందని వక్రీకరించే మాట్లాడితే... ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ‘‘మా బడ్జెట్ నే ఎన్డీయే ప్రభుత్వం కాపీ కొట్టింది’’ అని తీవ్రంగా విమర్శించారు.

గతంలో నరేంద్రమోడీ కూడా మన్మోహన్ సింగ్ సర్కార్ విడుదల చేసే బడ్జెట్లపై తీవ్రంగా కామెంట్లు చేసేవారు. తన ట్విటర్ అకౌంట్ ద్వారా వారికి వ్యతిరేకంగా కామెంట్లను పోస్ట్ చేసేవాడు. ఇప్పుడు అందుకు ప్రతీకారంగా మన్మోహన్ సింగ్ విమర్శలు చేశారని కొంతమంది అంటే.... అసలు భవిష్యత్తు రాజకీయ ప్రయాణానికి ఎలాంటి అవకాశం లేని ఈ పెద్ద మనిషి.. కేంద్ర బడ్జెట్ మీద విమర్శించడానికి కారణాలేంటి..? అని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా మన్మోహన్ పెదవి విరచడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles