Visa on arrival at hyderabad from september

visa on arrival in india, indian visa simplified, indian visa on arrival to develop tourism, visa on arrival at hyderabad from september, visa on arrival improves medical institutions in hyderabad

visa on arrival at hyderabad from september

తక్షణ వీసాతో హైద్రాబాద్ కి మేలు

Posted: 07/11/2014 12:19 PM IST
Visa on arrival at hyderabad from september

విదేశాలనుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించటానికి అమలు చెయ్యబోతున్న ఈ విధానంలో పర్యాటకులు భారత్ లో అడుగుపెట్టిన తర్వాతనే భారత్ వీసాను పొందవచ్చును.  

ఇది తెలంగాణా రాష్ట్రంలో ముందుగా హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సెప్టెంబర్ నుంచి మొదలవబోతోంది.  హైద్రాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా మరో ఎనిమిది ఎయిర్ పోర్ట్ లలో ఈ వీసా విధానాన్ని ప్రారంభించబోతున్నారు.  దీనివలన పర్యాటక రంగం అభివృద్ధి చెందుతనే అభిప్రాయంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.  

దేశం మొత్తంలో చూసుకుంటే హైద్రాబాద్ వైద్యరంగంలో కూడా బాగా అభివృద్ధి చెందటమే కాకుండా మిగిలిన ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడ వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు తక్కువే.  అందువలన తక్షణ వీసా అమలు లోకి రావటం వలన పర్యాటక రంగంతో పాటు వైద్య రంగం కూడా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని కూడా పలువురు వెలిబుచ్చుతున్నారు.

ఈ విధంగా వీసా విధానాన్ని సరళీకృతం చెయ్యటంతో సర్వతోముఖాభివృద్ధి కలుగుతుందని మోదీ సర్కార్ భావిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles