Chandrababu asks ministers to work with speed

ap cabinet meeting held by chandrababu, chandrababu asks ministers to work with speed, chandrababu asks ap ministers to increase pace, unsolved fees reimbursement in telangana

chandrababu asks ministers to work with speed

ఇక స్పీడ్ పెంచాలి బాబులూ!

Posted: 07/11/2014 10:44 AM IST
Chandrababu asks ministers to work with speed

నెల రోజులు నత్తనడకను ఉపేక్షించిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇప్పటికే నెలయిపోయింది, స్పీడ్ పెంచటం అవసరమని హెచ్చరించారు.

హైద్రాబాద్ లో లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెలైందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, మనలను ఎన్నుకున్న ప్రజలు మననుంచి మంచి పనులను ఆశిస్తారు కాబట్టి మీ మీ శాఖల మీద అధ్యయనం చేసి, పట్టు పెంచుకుని, అంతర్గత సమస్యలను పక్కకు పెట్టి మీ పనులను మీరు చెయ్యండని అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు తెదేపా పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందని, కేవలం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద మాత్రమే తెదేపా పోరాడుతుందని, పరిశ్రమల మీద కాదని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

విద్యార్థుల ఫీజ్ రియంబర్స్ మెంట్ మీద తెలంగాణాలో జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించే పనిలో కూడా ప్రభుత్వం ఉందని, దాన్నిబట్టే ఆంధ్రప్రదేశ్ లో విధానాన్ని కూడా రూపొందిస్తామని చంద్రబాబు అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles