Rahul nap in loksabha

Rahul nap in Loksabha, BJP comments on Rahul nap in Loksabha, BJP comments Congress sleeping over price rise

Rahul nap in Loksabha made BJP to comment

రాహుల్ కునుకు మీద కినుక

Posted: 07/10/2014 10:01 AM IST
Rahul nap in loksabha

లోక్ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిన్నపాటి కునుకు తీయటం సభలో సంచలనం రేపింది.  బుధవారం నాడు రాహుల్ గాంధీ లోక్ సభలో రాహుల్ కి కన్ను అంటుకోవటం కూడా దేశంలో ధరలు పెరుగిపోతున్న అంశం మీద చర్చిస్తున్నప్పుడు.   దానితో, పది సంవత్సరాలుగా కాంగ్రెస్ చేస్తున్నపనే అదేనంటూ భారతీయ జనతాపార్టీ కాంగ్రెస్ పార్టీ మీద చురకలు వేసింది.  

నిజానికి దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలో భాజపా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల ప్రశ్నలను ఎలా తట్టుకుంటుందా అని అనుకుంటున్న సమయంలో సీన్ రివర్స్ అయింది.  ఎన్నికల సమయంలో ధరల విషయంలోనే ప్రభుత్వాన్ని బాగా ఎండగట్టిన భాజపా ప్రస్తుతం దేశంలో చెలరేగిపోతున్న ధరల విషయంలో బడ్జెట్ సెషన్ లో అన్ని పార్టీలనుండి విమర్శలను ఎదుర్కుంటుందని, అదే పెను సవాల్ కాబోతున్నదని విశ్లేషకులు చెప్తూ వచ్చారు.  కానీ ఇక్కడ భాజపా పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ధరల విషయంలో మొద్దు నిద్ర పోతూ వస్తోందని అందుకు రాహుల్ ని చూస్తే తెలుస్తోందని ఎద్దేవా చేసింది.  

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా జరిగేది ఇదే.  పాత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దటానికే అవస్తలు పడుతున్నామంటూ కొత్త ప్రభుత్వం చెప్తుంది, కొత్త ప్రభుత్వం వచ్చి ఏం ఒరగదీసిందంటూ పాత ప్రభుత్వం విమర్శలను గుప్పిస్తుంటుంది.  ప్రస్తుతం అదే జరుగుతోంది.  కాకపోతే భాజపాకి కాస్త కాలు చెయ్యి కూడదీసుకునేందుకు సమయం ఇవ్వాలన్నది సర్వత్రా వినిపిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles