Rbi sports quota recruitment 2014 assistant

RBI Sports Quota Recruitment 2014 Assistant, Office Attendant, Assistant, Indian Sportspersons

RBI Sports Quota Recruitment 2014 Assistant

ఆర్.బీ.ఐ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు...

Posted: 07/09/2014 06:42 PM IST
Rbi sports quota recruitment 2014 assistant

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బీ.ఐ) స్పోర్ట్స్ కోటాలో అర్హత గలిగిన ఆటగాళ్ళను అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు వివిధ ఆర్.బీ.ఐ బ్యాంకులో నియమించుకొనుటకు ధరఖాస్తులకు ఆహ్వానించింది. మొత్తం 53 ఖాళీలకు గాను ఈ ధరఖాస్తును విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోదలచిన వారు ఈనెల 21వ తేదీలోగా ధరఖాస్తులు సంబంధింత కార్యాలయాలకు వెళ్లే విధంగా చూసుకోవాలని సూచించారు. వీటికి సంబంధించిన పోస్టులను వివిధ క్రీడల నుండి భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

క్రికెట్ పురుషుల విభాగం నుండి (12) , ఫుట్ బాల్ పురుషుల విభాగం నుండి (24) , బ్యాట్మింటన్ పురుషుల విభాగం నుండి  (05) క్యారమ్ పురుషుల విభాగం నుండి (03), క్యారమ్ మహిళల విభాగం నుండి (02), టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగం నుండి (03), టేబుల్ టెన్నిస్ మహిళల విభాగం నుండి (04) ఈ ఖాళీలను పూర్తి చేయనుంది. ఈ పోస్టులకు వయస్సు 18 నుండి 26 సంవత్సరాల లోపు ఉండాలని, రిజర్వేషన్ వారికి 5 సంవత్సరాలు అదనంగా కలుపుకుంటే (31 సం. జూలై 01 వరకు) , జనరల్, ఓబీసీ వారికి అదనంగా మూడు సంవత్సరాలు కలుపుకుంటే (29 సం. జూలై 01) గా ఉండాలని సూచించారు.

విద్యార్హతలు అసిస్టెంట్ కి 01.08.2014 వరకు బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులు అయి ఉండాలి. అది రిక్యూట్ మెంట్ జోన్ కి చెందిన గుర్తింపు యూనివర్శిటీ అయి ఉండాలని సూచించారు.

ఆఫీస్ అటెండెంట్ కి చివరకు పదవ తరగతి పాసై, సంబంధిత జోన్ మెట్రిక్ బోర్టుకు చెందినదై ఉండాలి.

ఒకవేళ మీరు పదవ తరగతి లేదా బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసే వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ : అర్హత కలిగి ఎంపికైన అభ్యర్థుల్ని సంబంధిత ఆఫీసులలో ఇంటర్య్వూ చేస్తారు.

ధరఖాస్తు ఫీ : 100 రూపాయలు జనరల్ కేటగిరీకి ఓబీసీ కేటగిరీకి చెందిన వారు చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవరం లేదు. అప్లికేషన్ ని సంబంధిత వెబ్ సైట్ నుండి తీసుకొని 21.07.2014 లోపు సంబంధిత ఆఫీసుకు చేరేవిధంగా చూసుకోవాలి.

మరిన్ని వివరాల కోసం : http://www.rbi.org.in చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles