Goa minister dhawalkar bikini morphed photo in facebook becomes controversial

goa minister dhawalkar bikini morphed photo in facebook becomes controversial, goa minister sudin dhawalkar latest news, dhawalkar morphed photo in facebook, dhawalkar bikini morphed photo in facebook

goa minister dhawalkar bikini morphed photo in facebook becomes controversial

బికినీలో కనువిందు చేసిన గోవామంత్రి!

Posted: 07/09/2014 02:24 PM IST
Goa minister dhawalkar bikini morphed photo in facebook becomes controversial

(Image source from: goa minister dhawalkar bikini morphed photo in facebook becomes controversial)

ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా ప్రభావం ఎలా వుందో ప్రతిఒక్కరికి తెలిసిందే! యువత అయితే ఖాళీ సమయంలో వీటిద్వారానే కాలక్షేపం చేస్తారు. మరికొంతమంది బిజినెస్ పరంగా వినియోగించుకుంటున్నారు. కానీ ఆకతాయిలు మాత్రం దీనిని దురపయోగం చేసుకుంటున్నారు. రానురాను ఇది విపరీతంగా పెరిగిపోతోంది. అందుకు నిదర్శనంగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది.

కొన్నిరోజులకింద గోవా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ మంత్రి అయిన సుదిన్ ధవల్కర్ గోవా బీచ్ పరిసర ప్రాంతాల్లో అమ్మాయిలు బికినీలు ధరించుకోకుండా రావాలని, బికినీని త్వరలోనే బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గోవా నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇన్నాళ్లవరకు ఎవరు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నవాళ్లు... సదరు మంత్రిపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ‘‘బీచ్ దగ్గరు బికినీలు కాకుండా, చీరలు కట్టుకుని వస్తారా’’ అంటూ కౌంటర్ అటాక్ చేశారు.

ఈ నేపథ్యంలోనే అమెరికాలో వుంటున్న గోవాకు చెందిన సేవియో అల్మెడా అనే వ్యక్తి గోవా మంత్రి ధవల్కర్ ఫోటోను పింక్ బికినీలో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. సదరు ఫోటోను చూసిన గోవా నెటిజన్లు ఫుల్లుగా ఎంజాయ్ చేసుకున్నారు. అందుకు తగినట్లుగా బాగానే కామెంట్లు కూడా చేశారు. అయితే ఈ విషయం క్రమక్రమంగా ప్రభుత్వానికి చేరిపోయింది. దీంతో వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును సైబర్ సెల్ కు అప్పగించారు. దర్యాప్తు కొనసాగించిన పోలీసులు... ఆ వ్యక్తి వివరాలను అప్పటికప్పుడే తెలుసుకోగలిగారు. ఆ వ్యక్తిపై త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్టు గోవా పోలీసులు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles