Narendra modi comments on latest railway budget 2014 2015

Narendra modi comments on latest railway budget 2014-2015 narendra modi latest news, narendra modi comments on railway budget, narendra modi praises railway budget, narendra modi praises sadananda gowda, railway budget 2014-2015 news, railway budget released

Narendra modi comments on latest railway budget 2014-2015, BJP Party

రైల్వే బడ్జెట్ ను ప్రశంసించిన మోడీ!

Posted: 07/08/2014 05:14 PM IST
Narendra modi comments on latest railway budget 2014 2015

(Image source from: Narendra modi comments on latest railway budget 2014-2015)

ఒకవైపు ప్రతిపక్ష నాయకులు, సామాన్య నగరవాసులు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిరసన వ్యక్తం చేస్తుంటే... ప్రధాని నరేంద్రమోడీ మాత్రం దానిని పొగుడుతున్నారు. తమ ప్రభుత్వం నుంచి విడుదలయిన మొదటి రైల్వే బడ్జెట్ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఆయన ఈ బడ్జెజ్ ను విడుదల చేసిన కేంద్రమంత్రి గౌడను పొగిడారు.

ఈ బడ్జెట్ పై మోడీ మాట్లాడుతూ... ‘‘ఈ సారి విడుదలైన బడ్జెట్ ను చూస్తుంటే దేశం అభివృద్ధి బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది ఒక ఇండియాకు ఒక ‘‘గ్రోత్ ఇంజన్’’ పనిచేస్తుంది. మన భారతదేశంలో వున్న పారదర్శకతను తొలగించి, దేశ సమగ్రతను చాటేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. దీనిని గుర్తు చేసుకున్న ప్రతిసారి భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం కనిపిస్తోంది. ఈ బడ్జెట్ ద్వారా మన టెక్నాలజీని సదావకాశంగా వినియోగించుకోవచ్చు. ఈ బడ్జెట్ మన ఆధునిక భారతదేశాన్ని ప్రతిబింబిస్తున్నట్టు అనిపిస్తోంది’’ అని ఆయన తన మనసులోని భావనలను వ్యక్తం చేశారు.

అలాగే.. ‘‘ఈసారి విడుదలైన రైల్వే బడ్జెట్ ఆధారంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి దిశలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు. ‘‘ఈ బడ్జెట్ తో మనం సెక్టార్ లను ఆధునికతగా మార్చుకోవచ్చు. భారతదేశంలో రైల్వే ప్రాముఖ్యత ఎంతగా వుందో ఈ బడ్జెట్ మనకు నిరూపిస్తోంది. మనకు మరిన్ని సౌకర్యాలను కల్పించుకోవడానికి వీలుగా వుంటుంది. ఈ బడ్జెట్ మన భారతదేశాన్ని అభివృద్ధి దిశకు తీసుకెళ్తుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సదానందగౌడ వెల్లడించిన ఈ బడ్జెట్ ప్రకారం.. కొత్త ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles