Central minister sadananda gouda releases railway budget of 2014 15

central minister sadananda gouda releases railway budget of 2014-15 central minister sadanana gouda, railway budget, railway budget 2014-15, railway budget news, lok sabha latest news

Indian Railway Budget 2014-15 Highlights in Telugu. Union Minster Sadanada Gouda Presenting his first Railway Budget in Loksabha.

రైల్వే బడ్జెట్ విడుదల

Posted: 07/08/2014 01:14 PM IST
Central minister sadananda gouda releases railway budget of 2014 15

(Image source from: central minister sadananda gouda releases railway budget of 2014-15)

మంగళవారంనాడు లోక్ సభలో కేంద్రమంత్రి సదానందగౌడ రైల్వే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే భారత ఆర్థిక వ్యవస్థలకు రైల్వే వ్యవస్థ ఆత్మ లాంటిదని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న తరుణంలో ఆయన మాట్లాడుతూ... కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయని ఆయన తెలిపారు.

అలాగే రైల్వే శాక ప్రతిరోజు 2.30 కోట్లమంది ప్రయాణీకులను తమ గమ్యస్థానానికి చేరుస్తుందని తెలిపారు. రైల్వే శాఖను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేస్తోందంటూ మాట్లాడిన ఆయన... త్వరలోనే సేఫ్టీతో కూడిన హైస్పీడ్ ట్రెయిన్లను, భద్రతా విషయంలో సెక్యూరిటీని నెలకొల్చుతామని ఆయన వెల్లడించారు. సరుకు రవాణాలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చడమే భారత రైల్వే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

1. గత కొన్నేళ్లుగా రవాణా రంగంలో రైల్వే ఆదాయం చాలా తగ్గుతూ వస్తోంది. అలాకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేలను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.

2. ప్రస్తుతం రైల్వేకు వస్తున్న ఆదాయంలో ఒక రూపాయికిగాను 94పైసలు ఖర్చవుతోందని ఆయన స్పష్టం చేశారు.

3. గతంలో ప్రవేశపెట్టిన కొత్త ప్రాజెక్టులు ఇప్పటివరకు కేవలం ఆమోదం పొందాయే తప్ప... వాటిని పూర్తి చేయడంలో దృష్టి సారించలేదని ఆయన అన్నారు. దాదాపు 359 ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయాల్సి వుందని ఆయన వెల్లడించారు.

4. ఇప్పటివరకు పెండింగ్ లో వున్న ప్రాజెక్టుల కోసం సుమారు రూ.1.82 లక్షల నిధులు అవసరం వుందని ఆయన తెలిపారు.

5. రైల్వే స్పీడును గంటకు 160 కి.మీ నుంచి 200 కి.మీ. వరకు పెంచేలా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

6. రైల్వే రిజర్వేషన్ల విధానాన్ని మారుస్తామని చెప్పిన ఆయన... రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా పోస్టాఫీసులను కూడా ఉపయోగించుకుంటామని అన్నారు.

7. మహిళలకోసం ప్రత్యేకంగా 4వేలమంది మహిళా ఆర్పీఎఫ్ పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

8. వృద్ధులకు, వికలాంగులకు కోసం రైల్వే స్టేషన్లలో బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

9. 5 సంవత్సరాలలోపు రైల్వేశాఖలో పేపర్ లెస్ ఆఫీసులను నిర్మిస్తామని ఆయన తెలిపారు.

10. కొన్ని ప్రత్యేకమైన సెక్టార్లలో బుల్లెట్ ట్రెయిన్ల నిర్మాణం

11. అన్నీ ‘‘ఏ’’ కేటగిరి ట్రెయిన్లలో వై-ఫై సౌకర్యాలు ఏర్పాటు చేయడం

12. 2014-15 రైల్వే బడ్జెట్ 1,64,374 గా అంచనా!

13. ఛార్జీల పెంపుతో రూ. 8వేల కోట్ల ఆదాయం లభించింది.

14. అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు నిర్మాణం

15. స్టషన్లలో భద్రతను పరిశీలించేందుకు ప్రతిచోటా సీసీటీవీల ఏర్పాటు

16. సీటు, బెర్త్ మాత్రమే కాకుండా.. కోచ్, రైలును కూడా బుక్ చేసుకునే సౌకర్యం.

17. ఆర్పీఎఫ్ సిబ్బందికి ప్రత్యేకమైన సెల్ ఫోన్లు

18. ప్రైవేటు భాగస్వామ్యంతో చేతులు కలిపి మౌలిక వసతుల కల్పించేందుకు ప్రాధాన్యత

19. 50 మేజర్ స్టేషన్లలో పారిశుధ్యత కార్యక్రమాలను ఔట్ సోర్సింగ్ ద్వారా నిర్వహించడం

20. రైల్వే సిబ్బంది సంక్షేమ నిధి రూ.500 కోట్ల నుంచి 800 కోట్ల వరకు పెంచడం.

21. కాపలా లేని 5400 రైల్వే లెవెల్ క్రాసింగ్ లను మూసివేయడం

22. నూతనంగా రైల్వే యూనివర్సీటీలను నిర్మించడం

23. ప్రజల సంక్షేమం, భద్రతా కోసం 17000మంది ఆర్పీఎఫ్ సిబ్బంది.

24. ఆన్ లైన్ ద్వారా ప్రయాణ, ప్లాట్ ఫాం టికెట్ల విక్రయాలు

25. విమానాశ్రయ స్థాయిలో ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా ఆధునీకరణ విధానాలు

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles