Jagan party workers attack on mp muralimohan vehicle in westgodawari

jagan party workers attack on TDP mp, YSRCP workers attack on TDP mpmurali mohan rajamundhry mp, mpp election, murali mohan in westgodawari, jagan party workers attack on TDP mp muralimohan vehicle.

jagan party workers attack on TDP mp muralimohan vehicle in westgodawari

ఎంపీ మురళీ మోహన్ పై జగన్ గ్యాంగ్ దాడి !

Posted: 07/05/2014 09:39 AM IST
Jagan party workers attack on mp muralimohan vehicle in westgodawari

ఆంద్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అవసరమైతే.. ఎదురుదాడి చేస్తున్నారు. అధికారం దక్కలేదు కాబట్టి, గెలిచిన నాయకులపై పగ తీర్చుకుంటున్నారు. రెండు రోజుల నుండి ఆంద్రప్రదేశ్ లో జగన్ గ్యాంగ్ ..చంద్రబాబు పార్టీ నేతలను, కార్యకర్తలను ఉతికిపారేస్తున్నారు. ఏ నియోజక వర్గంలో చూసిన వైసీపి , టిడిపి మద్య పోరు నడుస్తుంది. దీంతో అనేక చోట్లు పోలీసులు, లాఠీలకు, బాష్పవాయువులకు, రబ్బర్ బుల్లెట్లకు పని చెబుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండల పరిషత్తు అధ్యక్ష ఎన్నిక సందర్భంగా టీడీపీ- వైపీసీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్బంలోనే టిడిపి రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ వాహనం పై జగన్ గ్యాంగ్ ఘోరంగా దాడి చేసింది. జగన్ గ్యాంగ్ దెబ్బలకు .. ఆయన కారు గాయల పాలైంది. వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ సమాచారం అందుకున్న రాజమండ్రి ఎంపీ మురళీ‌మోహన్ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అసలు విషయం ఏమిటంటే.. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ మద్దతుతో గెలిచిన సుబ్బారావు, వైసీపీకు మద్దతు తెలపడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు.

దీంతో గొడవ ముదిరి .. ఎంపీ మురళీమోహన్ కారు పై జగన్ గ్యాంగ్ పగ తీర్చుకున్నారు. ఈ ఘటన అనంతరం అధికారులతో మాట్లాడి, తిరిగి వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు ఎంపీ మళ్లీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కారు కు మాత్రం పెద్ద పెద్ద గాయాలు తగిలాయి. దీంతో వెంటనే ఎంపీ సెక్యూరిటీ అలెర్ట్ కావడంతో అక్కడ నుంచి జగన్ పార్టీ కార్యకర్తలు పరారయ్యారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles