మరపు తెప్పించే హక్కు (Right to be forgotten) ఈ హక్కును యూరోపియన్ జడ్జ్ లు ప్రసాదించారు. పోయిన నెలలో యూరోపియన్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, అనవసరమైన, అప్రస్తుతమైన, కాలం తీరిపోయిన డేటాను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసేవారికి అందకుండా తీసివేసే హక్కుని ఆయా వ్యక్తుల కోరికమీద తొలగించే హక్కునిచ్చింది.
దీనితో గతంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ లోకి వచ్చే కొన్ని వివరాలను సెర్చ్ లోకి రాకుండా గూగుల్ సంస్థ వాటిని తీసివేసింది. ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని వాడేవారిలో తీవ్ర అసంతృప్తిని కలుగజేసింది. అలా తీసివేసినదానిలో మొదటిది- ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యాన్ని కలుగజేసినట్లుగా ఒక మిలియనీర్ బ్యాంకర్ మీద ఆరోపణ చేస్తూ చెప్పిన కథనం అది.
అలాగే మెయిల్ ఆన్ లైన్ నుండి గూగుల్ తీసేసిన మొదటి స్టోరీ- వివాదస్పదమైన స్కాటిష్ ఫుట్ బాల్ మ్యాచ్ రిఫరీ మెక్ డొనాల్డ్ కథనం. అందులో అతను సెల్టిక్ వెర్సస్ డుండీ యునైటెడ్ మ్యాచ్ లో పెనాల్టీ ఇవ్వటానికి తప్పు కారణాలను తెలియజేసాడు. మెయిల్ ఆన్ లైన్ నుంచే ఉద్యోగం కోసం వచ్చిన ముస్లిం అభ్యర్థి పట్ల వివక్ష చూపించిన కేథే ఎయిర్ లైనర్ గురించిన వివరం కూడా గూగుల్ తీసేసినవాటిలో ఉంది. అతనిది ముస్లిం పేరు కాబట్టి తన సంస్థలో ఉద్యోగం ఇవ్వటానికి నిరాకరించింది. మరో కథలో వర్జిన్ రైల్ లో శృంగారక్రీడలో పట్టుబడ్డ స్త్రీపురుషుల ఉదంతం కూడా ఉంది.
అయితే మెయిల్ ఆన్ లైన్ మాత్రం ఆ స్టోరీలను తొలగించలేదు. మెయిల్ ఆన్ లైన్ పబ్లిషర్ మార్టిన్ క్లార్క్ దీనిమీద మాట్లాడుతూ, ఇది ఎంత అర్థం లేని హక్కో చూడండి. మరపు తెప్పించే హక్కు అనేది గ్రంధాలయానికి పోయి అక్కడున్న పుస్తకాలను కాల్చివేసినదానితో ఇది సమానమని వ్యాఖ్యానించారు. ఈ కథనాల్లో అసత్యముందని ఎవరంటారు అని ప్రశ్నించారాయన.
ఈ విషయంలో గూగుల్ సంస్థ ఇలా ప్రకటించింది- వ్యక్తిగతమైన రహస్యాలను పరిరక్షించటం, దానితో పాటు జనరల్ పబ్లిక్ కి విషయాలను తెలుసుకునే హక్కు, ఆ వివరాలను ఇతరులకు తెలియజేసే హక్కులను దృష్టిలో పెట్టుకుని, తొలగించే డేటాను నిర్ణయించటం జరుగుతుందని తెలియజేసింది. అలాగే వాటిని తొలగించమని కోరిన వ్యక్తుల వివరాలను కూడా తెలియజేయబోమని మెయిల్ ఆన్ లైన్ కి తెలియజేసింది.
ప్రముఖ వెబ్ సైట్లైన బిబిసి, ద గార్డియన్ కూడా కొన్ని యుకె, యూరప్ లకు చెందిన సైట్స్ లోని వివరాలను గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోకి రాకుండా తొలగించారు.
ఈ మరపుతెప్పించే హక్కు వలన గూగుల్ సెర్చ్ ఇంజిన్ సంస్థకి చేతినిండా పనిపడింది. తొలగించాల్సిన డేటాను నిర్థారించేందుకు ఒక బృందాన్నే తయారుచేసింది. మెయిల్ ఆన్ లైన్ కి గూగుల్ సంస్థ తాను సెర్చ్ కి అందకుండా తొలగించదలచకున్న డేటా వివరాలను అందజేసింది.
అయితే ఈ తొలగింపులు యూరప్ కి చెందిన అత్యున్నత న్యాయస్థాన తీర్పువలన చేస్తున్నవి కాబట్టి ఎవరైనా అమెరికా వెర్షన్ గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేస్తే మాత్రం వాళ్ళకి అవి దొరుకుతాయని కూడా గూగుల్ తెలియజేసింది. ఇప్పిటికే గూగుల్ డేటాను తొలగించవలసిందిగా 50000 విజ్ఞప్తులను అందుకుంది. తొలగించిన పేజ్ ల మీద సెర్చ్ జరిగినప్పుడు, యూరోపియన్ డేటా భద్రతా చట్టం కింద తొలగించటం జరిగిందని కింద భాగంలో సూచన వస్తుంది.
ఈ విషయంలో గూగుల్ ఏ డేటాను తీసివేయాలి అని చేసే నిర్ణయాన్ని కొందరు ప్రముఖ వ్యక్తులు సవాల్ చెయ్యదలచుకున్నా, అది అనవసరంగా వాళ్ళని బయటకు లాగుతుందనే భయంతో ఊరుకున్నారు.
మొత్తానికి గూగుల్ కి చేతినిండా పని, దానితో పాటు విమర్శలనెదుర్కునే అవకాశం కూడా.
అయితే, ఇందులో మరో తిరకాసుంది. డేటాను తొలగించమని కోరే వ్యక్తులను గూగుల్ గుర్తించదు. ఉదాహరణకు 2007 లో ఒక బ్లాగ్ లో మెర్రిల్ లించ్ బ్యాంకింగ్ సంస్థ భారీ నష్టాలలో కూరుకుపోయినప్పుడు ఏ విధంగా ఆ సంస్థ హెడ్ ఓ నీల్ ని తొలగించి బయటకు పంపించేసింది అన్న కథనం ఉంది. దాన్ని సెర్చ్ ఇంజిన్ లో రాకుండా తొలగించమని విజ్ఞప్తి చేసే వ్యక్తి ఓ నీల్ అవక్కర్లేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more