Swamy gowd elected as t council chairman

telangana council chairman elections, swamy gowd elected as t council chairman, congress party boycotted council chairman elections, congress leader d srinivas objects council chairman elections

swamy gowd elected as t council chairman

భస్మాసుర ‘హస్తం’

Posted: 07/02/2014 04:35 PM IST
Swamy gowd elected as t council chairman

భస్మాసురుడి కథ అందరికీ తెలుసు. చెయ్యి పెడితే భస్మమవాలని వరాన్ని కోరిన భస్మాసురుడు ఆ వరం ఫలిస్తుందో లేదో చూడటానికి వరమిచ్చిన ఆ శివుడి నెత్తి మీదనే ఆ చెయ్యి పెట్టటానికి ఉపక్రమిస్తాడు.  ఇది కేవలం సందర్భాన్ని గుర్తు చేసుకోవటానికే కానీ ఇక్కడ ఎవరినీ భస్మాసురుడితోను, ఎవరినీ శివుడితోనూ పోల్చటానికి కాదు.  

ఎవరెన్ని విధాల నిరసనలు చూపించినా, అభ్యంతరాలు తెల్పినా, హడావిడిగా గంటల్లో తెలంగాణా ఏర్పాటు మీద రాజ్యసభలో తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక విష సంస్కృతికి నాంది పలికింది.  అదేమిటంటే ఎవరెంత మొత్తుకుంటున్నా అధికార పార్టీ తను అనుకున్న పనిని చేసి తీరుతుంది అని.  అది కూడా అప్పర్ హౌస్ లో.  

ఏ తెలంగాణా కోసమైతే అన్ని అభ్యంతరాలనూ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ ముక్కుకు సూటిగా పోయిందో, అదే తెలంగాణాలోని అప్పర్ హౌస్ లో కాంగ్రెస్ కి పరాభవం జరిగింది అదే శైలిలో.  

శాసనమండలిలో ఛైర్మన్ ఎన్నికమీద నామమాత్రపు చర్చలను చేస్తూ కాంగ్రెస్ నాయకుడు డిఎస్ మాటలను పట్టించుకోకుండా, ఎన్నికలను నిలిపివేయాలని చేస్తున్న డిమాండ్ ని పెడచెవినిపెడుతూ ఎన్నికలను నిర్వహించారు, మొదటి ఓటుని డెప్యూటీ సిఎం మహమూద్ అలీ వేసేసారు.  ఇది అన్యాయం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన చేసారు.  ఆ ఛైర్మన్ కూడా కాంగ్రెస్ కి చెందిన నాయకుడే- నేతి విద్యాసాగర రావు.  కాంగ్రెస్, తెదేపాలు ఎన్నికలను బహిష్కరించి మండలి నుంచి నిష్క్రమించిన తర్వాత ఆయన కూడా తెరాస అభ్యర్థి స్వామి గౌడ్ కే వోటేసారు.  ఆ ఒక్క వోటు పడకపోయినా గెలుపులో తేడా ఉండేది కాదనుకోండి కానీ కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరటన్నా కలిగేదేమో.  

ఎన్నికలలా పూర్తిగా ఏకపక్షమై కాంగ్రెస్ పార్టీకి తాము గతంలో అనుసరించిన విధానం గుర్తుకొచ్చివుండాలంటున్నారు ఆంధ్రప్రదేశ్ నాయకులు, రాజకీయరంగంలో ఆసక్తిగలవారు, రాజకీయ విశ్లేషకులు.  ఇదంతా నువ్వు నేర్పిందే అని మార్గదర్శనం చేసిన కాంగ్రెస్ మీదనే తెరాస ఆ విధానాన్ని అనుసరించి మండలి ఛైర్మన్ ఎన్నికలను నిర్వహించటం ఆంధ్రప్రదేశ్ నాయకుల ముఖాలలో చిరునవ్వును కాసేపు చిందించిందని చెప్పుకుంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles