Wall mart online stores in hyderabad

wall-mart online stores in hyderabad, wall mart online in hyderabad and lucknow, members special benefits in wall-mart online stores

wall-mart online stores in hyderabad

హైద్రాబాద్ లో వాల్ మార్ట్ ఔట్ లెట్

Posted: 07/02/2014 03:12 PM IST
Wall mart online stores in hyderabad

భారత దేశంలో హోల్ సేల్ మార్కెట్ లో తొలి అడుగుపెట్టిన అంతర్జాతీయ సంస్థ వాల్ మార్ట్ ముందుగా హైద్రాబాద్, లక్నో లలో ఆన్ లైన్ షాపింగ్ సెంటర్ ని మంగళవారం నాడు ప్రారంభించింది.  రిటైల్ లో అమెరికా దిగ్గజం వాల్ మార్ట్ భారత్ లో బెస్ట్ ప్రైస్ పేరుతో 20 హోల్ సేల్ స్టోర్ లను స్థాపించనుంది.

ఇ కామర్స్ వేదిక మీద ప్రారంభమైన ఈ హోల్ సేల్ సెంటర్ లో వాల్ మార్ట్ లోని అన్ని ఉత్పాదనలూ లభ్యమౌతాయని ఆ సంస్థ ప్రకటించింది.  ఇందులోని సభ్యులకు ప్రత్యేకమైన ఉత్పాదనలు కూడా ఉపలబ్ధమౌతాయని కూడా ఆ సంస్థ తెలియజేసింది.  

భారత్ లో వాల్ మార్ట్ ఆన్ లైన్ షాపింగ్ ని ప్రారంభించటానికి ముందే ఆ సంస్థ సభ్యులను చేర్చుకుని వారికి ఆన్ లైన్ షాపింగ్ మీద అవగాహనా కార్యక్రమాలను నిర్వహించింది.  

వాల్ మార్ట్ లో సభ్యులు ఆన్ లైన్ షాపింగ్ చెయ్యటానికి వెబ్ సైట్ www.bestpricewholesale.co.in

భౌతికంగానూ డిజిటల్ గానూ షాపింగ్ అనుభవాన్ని అనుసంధానం చెయ్యటమే వాల్ మార్ట్ ఇ కామర్స్ లక్ష్యమని వాల్ మార్ట్ సంస్థకి భారత దేశపు అధ్యక్షుడు, ఛీఫ్ ఎగ్జెక్యుటివ్ క్రిష్ అయ్యర్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles