Swamy swaroopanandendra saraswati on chandrababu

swamy swaroopanandendra saraswati on chandrababu, dwaraka peeth swaroopananda on saibaba, impact of chandrababu sworn in after sunset, no rains owing to chandrababu as swamy claims

swamy swaroopanandendra saraswati on chandrababu,

బాబు గొప్పదనాన్నిపరోక్షంగా వెలిబుచ్చిన పీఠాధిపతి

Posted: 07/01/2014 04:41 PM IST
Swamy swaroopanandendra saraswati on chandrababu

నిజంగా ప్రజాహితం కోరుకున్నవారయితే పీఠాధిపతులు ప్రజలను నిరుత్సాహపరచటం కాకుండా వారికి తెలిసిన యజ్ఞయాగాదులలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి కానీ, ప్రజలను భయభ్రాంతులను చేస్తూ,  భ్రమలలోకి తోస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సూర్యాస్తమయం తర్వాత ప్రమాణ స్వీకారం చేసారని, ఆయన హయాంలో వర్షాలు పడవని ప్రకటన చేసారు విశాఖపట్నం శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి.

నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అపరాహ్ణానికి ముందే ప్రమాణస్వీకారం చేసారు.  మరి దేశంలో వర్షాలు ఎందుకు పడనట్లో?  తెలంగాణాలో కెసిఆర్ ఉదయం వేళలోనే ప్రమాణ స్వీకారం చేసారు.  అక్కడ వర్షాలెందుకు పడటంలేదో?  అంటే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అంత శక్తివుందన్నమాట! ఇటు రాష్ట్రంలోను, అంతకు ముందు ఈ రాష్ట్రంలో భాగంగా ఉన్న ప్రాంతంలోనే కాక మొత్తం దేశం మీదనే ఆయన ప్రభావం పడేంత గొప్ప వ్యక్తన్నమాట!  ప్రతి సంవత్సరం వీచే ఋతుపవనాలు ఈ సారి ముఖ్యమంత్రి సూర్యోదయం దాటిన తర్వాత చేసిన ప్రమాణ స్వీకారానికి అలిగి అల్లంత దూరాన ఆగిపోయాయన్నమాట! 

వైవాహిత జీవితంలో ఐహికమైన వాంఛలతో కార్యాలను ఆచరించేవారి స్థితికి, సమాజాన్నుంచి దూరంగా ఉంటూ ఒంటిరిగా జీవించేవారి స్థితికంటే ఉచ్ఛస్థితిలో ఉండేదే సన్యాసం.  మనసులో ఉత్పన్నమయే కోరికల దృష్ట్యా కార్యాలను ఆచరించనివారే సన్యాసులు.  వాళ్ళకి కేవలం జ్ఞానసముపార్జనకే అనుమతి ఉంది.  సన్యాసులు వీలయితే ఇతరులకు ఏమైనా చేస్తారే కానీ ఇతరులనుంచి ఏమీ ఆశించరు.

కానీ మన దేశంలో సన్యసించి ఒక పీఠాన్ని స్థాపించి, లేదా స్థాపించిన పీఠానికి ఉత్తరాధికారులుగా వచ్చినవారిలో కొందరు దేశ, రాష్ట్ర రాజకీయాలలో కలుగజేసుకోవటం, లేదా ఇతర మతాలు, నమ్మకాల మీద విమర్శలు చెయ్యటం చేస్తున్నారు.  

ఈ మధ్యనే ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి, దేశ వ్యాప్తంగా ఎందరో హిందువులు కొలిచే సాయిబాబాకు ముస్లిం మతస్తుని ముద్రవేసి, ఆయనను ఆరాధించవద్దని, గుళ్ళు కట్టవద్దని, గంగలో మునగని ముస్లిం అని, వ్యాఖ్యలు చేసారు.  సాయిబాబాను ఆరాధించవద్దని హిందువులను ఆదేశించటమే కాకుండా సాయిబాబాను పూజించేవారు రాముడిని కొలవటానికి అర్హులు కారని కూడా ఆయన అనటం జరిగింది.  అది బాబా భక్తులనుంచి నిరసనలు వెల్లువెత్తటానికి దోహదం చేసింది.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles