Schools near by gas pipeline blast in andhra pradesh

14 killed, 15 injured in gas pipeline blast in ap, gas pipeline at blast a Gas Authority of India Limited, schools near by mamidi kuduru mandalam, gas pipeline belonging to GAIL in Andhra's East Godavari, explosion triggered by a GAIL gas pipeline, gas pipeline blast in Andhra Pradesh's East Godavari, schools near by gas pipeline blast in ap

schools near by gas pipeline blast in ap

2200 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం

Posted: 06/28/2014 11:47 AM IST
Schools near by gas pipeline blast in andhra pradesh

తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరంలో భగ్గుమన్న గ్యాస్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో మొత్తం 2200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  ప్రమాదం జరిగిన సమయం ఉదయం ఆరుగంటలవటం వలన విద్యార్థులకు పెను ప్రమాదం తప్పిపోయింది.  అంతేకాదు మరో గంట ఆలస్యమైయ్యుంటే గ్యాస్ మరింతగా వ్యాపించివుండేది.  

ఉదయం ఆరు గంటలకు టీ దుకాణంలో స్టౌ వెలిగించటానికి అగ్గిపుల్ల గీయగానే అప్పటికే వ్యాపించివున్న గ్యాస్ ఒక్కసారిగా అంటుకుని అప్పటికప్పుడే 14 మందిని సజీవదహనం చేసింది.  

సమయంతో పాటు గాలివాటు కూడా విద్యార్థులను రక్షించింది.  గ్యాస్ పైప్ లైన్ లోంచి లీకైన గ్యాస్ గాలివాటుతో తూర్పు వైపుగా మళ్ళింది.  గ్యాస్ పైప్ కి పశ్చిమం వైపు పాఠశాలలున్నాయి.  శ్రీచైతన్య లో 1800 మంది, శ్రవణ్య స్కూల్ లో 250 మంది, గీతాంజలి పాఠశాలలో 150 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

మరో విషయం గ్యాస్ పైపుల్లో తక్కువ వత్తిడితో ప్రవహిస్తుండటం.  కొండపల్లిలోని ల్యాంకో పవర్ కి 500 మెగావాట్ల పవర్ ఉత్పత్తికోసం సరఫరా చేస్తున్న గ్యాస్ ని ఆ సంస్థ ఉత్పత్తిని 75 మెగావాట్లకు కుదించటంతో గ్యాస్ సరఫరా కూడా తగ్గటం ప్రమాదాన్ని జరగటానికి అవకాశమున్నదానికంటే అదృష్టవశాత్తూ తక్కువ ప్రమాణానికి తీసుకునివచ్చింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles