Modi refuses to watch football finals

modi refuses to watch football finals, mounting problems in the country to modi govt, prices shooting up in india, modi goodwill intact as per survey

Modi refuses to watch football finals

కడుపు నిండితేనే క్రీడలు- మోదీ భావన ఇదేనా?

Posted: 06/26/2014 11:02 AM IST
Modi refuses to watch football finals

కడపునిండిన తర్వాతనే వినోదమైనా, క్రీడలైనా, విదేశీయానమైనా, విహారయాత్రలైనా అన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతపు ఆలోచనగా కనిపిస్తోంది.  ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ని చూడటానికి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది.  కానీ ఆయన రావటం లేదని చెప్పేసారు.  

విదేశాలతో మైత్రిని కూడా ప్రధానంగా తీసుకున్న మోదీకి ఈ పర్యటన నిజానికి మంచి అవకాశం ఇస్తుంది.  ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని గాంచిన మోదీ హాజరవటం వార్తలలోకి ప్రముఖంగా ఎక్కుతుంది.  బ్రిక్ దేశాల అధినేతలతో కలిసి కూర్చుని మ్యాచ్ ని చూడటమే కాకుండా వాళ్ళందరితోనూ సత్సంబంధాలను నెలకొల్పటానికి ఎంతో అవకాశాన్ని కల్పించే ఆహ్వానమది.  కానీ మోదీ రానని చెప్పేసారు.  ఈ విషయంలో ప్రధాని కార్యాలయం నుంచి ఎటువంటి వివరణా రాలేదు.  

అయితే దేశంలోని పరిస్థితిని చూస్తే అగమ్య గోచరంగా ఉంది.  ధరలను అదుపులో ఉంచటానికి వివిధ ప్రణాళికలు వేస్తున్న సందర్భంలో ఋతుపవనాలు కూడా అదనులో రాక నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వస్తున్నాయి.  అవి ఆకాశాన్నంటే ప్రయత్నంలో ఎగురుతున్నాయి, ఈ లోపులో విమర్శలకు ఎక్కడ సందు దొరుకుతుందా అని ప్రతిపక్షాలు కాచుకుని కూర్చున్నాయి.  బడ్జెట్ మీద ఇప్పటికే రణగొణధ్వనులు మిన్నంటుతున్నాయి.  ఇటువంటి పరిస్థితుల్లో మోదీ మ్యాచ్ లను చూడటానికి పోవటానికి తిరస్కరించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కాళ్ళముందున్న సమస్యను ముందుగా పరిష్కరించుకోవటమే ప్రధమ కర్తవ్యమని మోదీ భావించివుండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ధరలు పెరిగిపోయినా, భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నా, ఒక వార్తాపత్రిక నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో మోదీ మీద దేశప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles