Do not promote condoms health minister says

do not promote condoms health minister says, health minister harsh vardha to promote morals, promoting morals is better than promoting condoms, national aids control organization

Do not promote condoms Health Minister says,

ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

Posted: 06/25/2014 02:59 PM IST
Do not promote condoms health minister says

“ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?”అన్న ప్రశ్నకు హాస్యభరితమైన జవాబు “ఏం చెయ్యకూడదు!”

ఏం చెయ్యకపోతే ఏమీ రాదన్నది ఛలోక్తి.  కానీ ప్రస్తుతకాలంలో స్త్రీ పురుషుల సంబంధాలలో ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ, చొరవ చోటుచేసుకున్న సందర్భంలో సమాజంలో పెరిగిపోతున్న ఎయిడ్స్ వ్యాధిని నివారించటానికి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) విస్తృతంగా కండోమ్ ఉపయోగాన్ని ప్రమోట్ చెయ్యటాన్ని యూనియన్ హెల్త్ మినిస్టర్ డా.హర్షవర్ధన్ తప్పు పట్టారు.  

న్యూయార్క టైంస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, నాకో కేవలం కండోమ్ ఉపయోగాన్ని మాత్రమే సూచించటం సరికాదని అన్నారు.  దాని వలన ఎవరైనా చట్టవిరుద్ధంగా ఎటువంటి లైంగిక సంబంధాలనైనా కొనసాగించవచ్చునన్న సంకేతాలు సమాజానికి అందే అవకాశం ఉన్నదని, కండోమ్ వాడకాన్ని ప్రోత్సహించే బదులు నీతివంతమైన జీవన విధానాన్ని సూచించే దిశగా ఎయిడ్స్ కంట్రోల్ కి కృషిచెయ్యవచ్చని హర్షవర్ధన్ అన్నారు.  ఈ విషయంలో అంగీకరిస్తూ నాకో ఛీఫ్ వి.కె.సుబ్బురాజు, భారతదేశంలో నైతిక విలువలు పడిపోతున్నాయని అన్నారు.  

వి.కె. సుబ్బురాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హోమో సెక్సువల్స్ విషయంలో కండోమ్స్ ని కాదనటానికి వీల్లేదని, అయితే సాధారణ శృంగారంలో వివాహానికి ముందు సంబంధాలు కానీ లేదా వైవాహికేతర సంబంధాలు కానీ ఉండటం నీతిదాయకం కాదన్న విషయాన్ని ప్రొమోట్ చెయ్యమని మంత్రి సూచించారని అన్నారు.  స్త్రీ పురుషులలో విశ్వసనీయత ఉండాలన్నది హర్షవర్థన్ ఉద్దేశ్యం.  

అయితే కండోమ్స్ వాడకం వలన ఎయిడ్స్ మాత్రమే కాదు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే గనేరియా, బోదకాలు, సిఫిలిస్ లాంటి డజన్ వ్యాధులు వ్యాపించకుండా చేస్తుంది.  అందువలన ఎదుటి వ్యక్తిపట్ల విశ్వసనీయత చూపించి కండోమ్ వాడండని కొందరు వాదిస్తున్నారు.  కుటుంబ నియంత్రణకోసం కండోమ్స్ వాడకాన్ని ప్రోత్సహించినప్పుడు వ్యాధులు వ్యాపించకుండా ఉండటం కోసం కండోమ్స్ వాడితే తప్పేమిటని అడుగుతున్నారు.  

అలాగే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయమని, కేవలం ఉపదేశాలివ్వటం వలన వ్యాధులు ఆగిపోవని, సమాజ శ్రేయస్సు కోసం తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో అవగాహన కలిగించటం ముఖ్యమని కొందరు అభిప్రాయపడుతున్నారు.  కండోమ్స్ ఉన్నాయి కదా అని శృంగారంలో పాల్గొనరెవరూ.  అవి ఉండటం వ్యాదుల నుంచి రక్షణ కోసం.  అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles