Retirement age of ap employees increased to 60

Retirement age of AP Employees increased to 60, AP Employees retirement age 60, Telangana employees seek 60 as retirement age, Chandrababu promise of retirement age passed in Assembly, KCR faces problems with AP decision on retirement age

Retirement age of AP Employees increased to 60

చంద్రబాబు గెలుపుతో కెసిఆర్ కి ఎదురైన సమస్య

Posted: 06/25/2014 11:03 AM IST
Retirement age of ap employees increased to 60

విభాజ్య రాష్ట్రాల ఇరు ముఖ్యమంత్రులూ పోటాపోటీగా పనిచెయ్యటం ఆయా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి దారితీస్తున్నదనటంలో అనుమానం లేదు.  మరొకరికి చూపించటానికి, మీకంటే గొప్ప అని నిరూపించుకోవటానికి కాకపోయినా అభివృద్ధి అనేది ఎప్పుడూ ఆశించదగ్గదే.  కానీ పోల్చి చూడకపోతే అభివృద్ధి ఎంత జరిగిందన్నది తెలియదు కూడా.  ఇదే న్యూటన్ సాపేక్ష సిద్ధాంతం.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన వెంటనే చేసిన సంతకాలలో ప్రభుత్వద్యోగుల పదవీకాలానికున్న వయోపరిమితిని 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచటం.  అది శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదాన్ని పొందటంతో చంద్రబాబు విజయం సాధించినవారయ్యారు.  

దీన్ని పరిశీలిస్తున్న తెలంగాణా ఉద్యోగులు కూడా ఈ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకి కొన్ని ఉద్యోగ సంఘాలు విజ్ఞాపనను ఇద్దామని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  ఇది ఆయనను ఇరకాటంలో పెట్టటమే అవుతుంది.  ఆ పని చెయ్యకపోతే ఉద్యోగుల మనసులను కలతపెట్టినవారవుతారు, చేస్తే చంద్రబాబుని అనుసరించినట్లుగా అవుతుంది.  

కానీ ఒకసారి వెనక్కి పోయి 58 సంవత్సరాల వయోపరిమితిని అంతకు ముందు ఎవరు తగ్గించారా అని చూస్తే అదీ తెలుగు దేశం పార్టీయే.  తెదేపా సంస్థాపకుడు ఎన్టీఆర్ వయోపరిమితిని 58 నుంచి 55 కి తగ్గించారు.  అందుకు ఆయన చెప్పిన కారణం యువతకు అవకాశమిచ్చి నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవటం కోసం.  అంతే కాకుండా ప్రభుత్వోద్యోగులకు సీనియారిటీతో జీతం పెరుగుతుంది కాబట్టి ఆ స్థానంలో కొత్తగా చేరినవారికి ఇచ్చే జీతభత్యాలు చాలా తక్కువగా ఉంటాయి.  దాని వలన ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది.  అంతే కాక, అనుభవం ఎక్కువే ఉన్నా సీనియర్లకు జూనియర్లకంటే పనిచేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.  యువతకు పెరుగుతున్న టెక్నాలజీలో సులువులు కూడా బాగా తెలిసుంటాయి.  కానీ సీనియర్లు కొత్త విధానాలు, ముఖ్యంగా సాంకేతికంగా పరిజ్ఞానాన్ని పెంచుకోవటానికి సంశయిస్తారు.

ఇప్పుడు 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచటం వలన పై ప్రయోజనాలన్నీ పోతాయి.  కాబట్టి ఈ నిర్ణయం మంచి చేస్తుందా లేక చెడా అన్నది దృష్టికోణాన్నిబట్టి, పరిగణనలోకి తీసుకునేదాన్నిబట్టి ఉంటుంది.   అందువలన తెలంగాణాలో ఈ అంశం పైకి వచ్చినప్పుడు కెసిఆర్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడవలసిందే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles