Ap cm chandrababu offers to big companies

ap cm chandrababu offers to big companies, andhra pradesh developement, ap new capital, companies moving to ap, developement in andhra pradesh,

chandrababu offers to big companies

ఇక ఇటు వచ్చేయండి? బాబు

Posted: 06/25/2014 09:56 AM IST
Ap cm chandrababu offers to big companies

చరిత్రలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక రికార్డు సృష్టించుకోవటానికి చాలా కష్టపడుతున్నారు. పదేళ్లు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా ఉండి, ఆపారమైన రాజకీయ అనుభవం సంపాదించుకున్నారు. ఇప్పడు కేవలం 13 జిల్లాలు కలిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి అడుగులు వేస్తున్నారు. ఈ తొలి అడుగులో చరిత్రలో నిలిచిపోవాలని చంద్రబాబు శ్రద్దగా ముందుకు సాగిపోతున్నారు.

మొన్నటి వరకు అంటే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కనీ ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పన్నుల ఆదాయం, ఉద్యోగాల కల్పన పై దృష్టిపెట్టాయి. అయితే ముందుగా రాష్ట్రం అభివృద్ది కావాలంటే, కర్మాగారాలు, ప్రాజెక్టులు, రావాలి. ఆయా కంపెనీలు పన్నులు చెల్లించటం వల్ల రాష్ట్రం త్వరగా అబివృద్ది చెందుతుంది.

కానీ ఇప్పుడు సీమాంద్రలో చెప్పుకొదగ్గ కర్మాగారాలు, ప్రాజెక్టులు గానీ లేవు, దీంతో ఆదాయం అంత గా లేదు.. హైదరాబాద్ నగరం చుట్టూ కర్మాగారాలు, ప్రాజెక్టులు ఎక్కువుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆంద్రప్రదేశ్ కు భారీ నష్టం జరుగుతుందని గుర్తించిన చంద్రబాబు.. కొన్ని కంపెనీలను ఆంద్రప్రదేశ్ కు పిలిచే పనిలో బిజీగా ఉన్నారు. మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. ‘‘ఇక..ఇక్కడికి వచ్చేయండని.. బాబు పిలుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, జిల్లాలకు ప్రకటించిన వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ, రాష్ట్రం మొత్తానికి ప్రత్యేక హోదా ..వంటి వివిధ అంశాలపై స్పష్టత వచ్చిన తరవాత ఈ ప్రక్రియా ప్రారంభం అవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే హైదరాబాద్ నుంచి పలు కంపెనీలు నమోదిత కార్యాలయాలు ఆంద్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలకు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) తోచేపట్టిన పలు ప్రాజెక్టులు ఆంద్రప్రదేశ్ లో ఉన్నాయి. నౌకాశ్రయలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు ఈ కోవలోకి వస్తాయి. ఇవి కాకుండా ప్రైవేటు రంగంలో ఎరువుల కర్మాగారాలు, చమురు-సహజవాయువు కంపెనీలు , గ్రానైట్, టైల్స్ యూనిట్లు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్నాయి.

గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో పలు సిమెంట్ తయారీ యూనిట్లు ఉన్నాయి. గుంటూరు, కర్నూలు, జిల్లాల్లోని సిమెంటు క్లస్టర్లలో యూనిట్లు ఉన్న సిమెంటు కంపెనీల ఆఫీసులు (నమోదిత కార్యాలయాలు) హైదరాబాద్ లో ఉన్నాయి. ఇక శ్రీకాకుళం-విశాఖ సమీపంలో మరో పక్క తూర్పు గోదావరి జిల్లాలో, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ప్రైవేటు రంగంలోకి విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. వీటి కార్యాలయాలను హైదరాబాద్ నుంచి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించాలనేది చంద్రబాబు ఆలోచన. ఈ విషయంలో ఆయా సంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం మాట్లాడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఒక కంపెనీ నమోదిత కార్యాలయం ఏరాష్ట్రంలో ఉంటే, ఆ కంపెనీ ఆ రాష్ట్రానికి చెందిన కంపెనీ అవుతుంది. అది చెల్లించే పన్నులు ఆ రాష్ట్రానికే చెందుతాయి. కేంద్ర పన్నులు చెల్లిస్తే, అందులో ఆ రాష్ట్ర ప్రభుత్వానికే వాటా లభిస్తుంది. అందువల్ల కంపెనీ ఉత్పత్తి-వ్యాపార కార్యకలాపాలు ఎక్కడ సాగినప్పటికీ దాని నమోదిత కార్యాలయం ఎక్కడ ఉందనేది ముఖ్యాంశం అవుతుంది.

ఏ కంపెనీ అయిన రాయితీలు ఎక్కువుగా ఉన్న చోటకే వెళుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు.. పన్ను, రాయితీల , ఇతర ప్రొత్సాహకాలు దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నుంచి ఆంద్రప్రదేశ్ కు వెళ్లటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కార్యాకలాపాలు సాగిస్తున్న కొన్ని సంస్థలు తమ విస్తరన ప్రణాళికల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో యూనిట్లు నెలకొల్పేందుకు సిద్దపడుతున్నాయి. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే.. మాత్రం ఆంద్రప్రదేశ్ త్వరగా కోలుకుంటుందని రాజకీయ మేథావులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles