ఆంధ్ర తెలంగాణా ముఖ్యమంత్రులు ఎన్నికల హామీగా రైతుల ఋణమాఫీలను ప్రకటించటంతో ఇరు రాష్ట్రాలకు అది ప్రతిష్టాత్మకంగా మారింది. దానికి తోడు అది జరగని పని అని ఎన్నికల ముందు అన్న ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడు అధికార పక్షం వాటిని అమలుపరచాలని పట్టుపట్టే స్థితి కనిపిస్తోంది. ఇలాంటప్పుడు అధికార పార్టీ వెనక్కి తగ్గటానికి సిద్ధంగా లేదు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణాలోనైనా కానీ లేదా లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనైనా కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వెయ్యవలసిందే. అది తలమీద వ్రేలాడుతున్న కత్తిగా మారటమే అందుకు కారణం.
కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ బాంక్స్ అసోసియేషన్ కానీ ఇందుకు రాజీగా లేవు. బ్యాంక్ లో తీసుకున్న ఋణాలు ఆదాయాలు కావు. వాటిని తిరిగి చెల్లించాలి. అప్పులు ఎగ్గొట్టే సంస్కృతి భవిష్యత్తులో ఆర్థిక రంగంలో చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. సకాలంలో పూర్తిగా కానీ లేదా కొంతకాని చెల్లించినవారు ఈ పథకంలో పూర్తి లబ్ధి పొందకపోవటం వలన నష్టపోయిన వారిగా భావించే అవకాశం ఉంది.
ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీసే పథకాలు రాజకీయంగా తాత్కాలికంగా లబ్ధి కలిగించినా దీర్ఘకాలంలో అవి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయంటున్నారు రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్స్ అసోసియేషన్ అధికారులు.
రైతులకు సహాయాన్ని అందించటానికి బ్యాంక్ లు ఎప్పుడూ ముందుంటాయని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో అదనపు ఋణాలను కూడా ఇచ్చిన సందర్భాలున్నాయని, కానీ ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరే ఋణమాఫీకి రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభించటం కష్టమౌతుందని బ్యాంక్ లు అంటున్నాయి.
మరో విషయమేమిటంటే, ఈ రాష్ట్రాలలో దీన్ని అనుమతించినట్లయితే ఇదో విషసంస్కృతిగా మారి ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే దారిపట్టే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తటపటాయిస్తోంది.
కానీ ఎన్ని అభ్యంతరాలున్నా సరే ఇచ్చిన మాటకు కట్టుబడివుంటామంటున్నారు ముఖ్యమంత్రులు. లేదంటే ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకతలు ఆందోళనలకు తెరెత్తటం జరుగుతుందనే భయం వెంటాడటమే అందుకు కారణం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more