Modi to speed up cases against mps

Modi to speed up cases against MPs, MPs facing corruption charges, Corrupt MPs to be removed, Politics to be freed from corrupt MPs

Modi to speed up cases against MPs

ఎంపీల మీద విచారణలకు మోదీ సంసిద్ధత!

Posted: 06/12/2014 10:13 AM IST
Modi to speed up cases against mps

దేశంలో అవినీతిని అంతమొందించాలని కంకణం కట్టుకున్న ప్రధాన మంత్రి మోదీ ముందుగా నేరచరిత గల ఎంపీల మీద సత్వర విచారణ జరిపించటం కోసం సుప్రీం కోర్టును అర్థిస్తానని అన్నారు.  పారిశుద్ధ్యం ఇంటి నుంచే ప్రారంభించాలన్న ఉద్దేశ్యంతో ముందుగా ప్రజాప్రతినిధుల నుంచే ఆ పనిని ప్రారంభిస్తానని అన్నారాయన.  

బుధవారం నాడు పార్లమెంట్ లో చేసిన ప్రసంగంలో మోదీ అవినీతిని డయాబెటిస్ తో పోల్చారు.  డయాబెటిస్ ఎలాగైతే శరీర వ్యవస్థను నాశనం చేస్తుందో అలాగే దేశంలోని అవినీతి దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని అతలాకుతలం చేస్తుందని  మోదీ అన్నారు.  

రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నేరచరితులను అందులోంచి తీసివేస్తానని మోదీ హామీ ఇచ్చారు.  అవినీతిని అంతం చెయ్యటానికి అందుకే ముందుగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవారి మీద కేసులను త్వరగా ఏడాది లోగానే ముగింపుకి తీసుకునివచ్చి దోషులను శిక్షించటానికి, నిర్దోషులు హుందాగా తిరగటానికి తనవంతు ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు.  

ముందుగా ప్రజలు నాయకుల మీద కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించాలన్నారు మోదీ.  గతంలోని ఏ ప్రభుత్వాన్ని విమర్శించటం తన ఉద్దేశ్యం కాదని అంటూనే కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాల మీద ఆయన చెణుకులు విసిరారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles