Rashtrapati pranab mukherjee highlights in parliament

pranab mukherjee highlights in parliament, rashtrapati pranab mukherjee highlights, rashtrapati pranab mukherjee speech in parliament,

rashtrapati pranab mukherjee highlights in parliament, session of Parliament,

ఈరోజు రాష్ట్రపతి గారి ప్రసంగంలో హైలైట్స్

Posted: 06/09/2014 12:46 PM IST
Rashtrapati pranab mukherjee highlights in parliament

భారత రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

 ఏకగ్రీవంగా ఎన్నికైన లోక్ సభ స్పీకర్ కు శుభాకాంక్షలు.

1)  జాతీయ ఈ-గవర్నెన్స్ పథకాన్ని అమలు చేస్తాం.

2) గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన శైలిని మెరుగు పరచడం ప్రభుత్వ లక్ష్యాలలో ఒకటి. పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా దీన్ని సాధిస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఉండే సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలి.

3) దేశంలో పేదరికాన్ని పారద్రోలడం అతి పెద్ద సవాలు.

4) అధిక సంఖ్యలో ఉన్న యువతకు సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా... అద్భుత ఫలితాలను సాధిస్తాం.

5) సాధారణ విద్య, నైపుణ్యాల మధ్య ఉన్న గీతను చెరిపేస్తాం.

6) క్రీడా నైపుణ్యాలను గుర్తించేందుకు ప్రత్యేక పథకాన్ని చేపడతాం.

7) రైల్వే నెట్ వర్క్స్ అభివృద్ధి కోసం 'డైమండ్ క్వాడ్రిలేటరల్ నెట్ వర్క్' ఏర్పాటు చేస్తాం.

8) విమానయాన అభివృద్ధి కోసం దేశ వ్యాప్తంగా తక్కువ స్థాయి ఎయిర్ పోర్టులను నిర్మిస్తాం.

9) అంతర్జాతీయ స్థాయిలో ప్రజా ప్రయోజనకర న్యూక్లియర్ అగ్రిమెంట్లను చేసుకుంటాం.

10) భారతీయ సంస్కృతిలో భాగమైన గంగానదిని పరిశుద్ధం చేస్తాం.

11)  ప్రజల జీవిత స్థాయిని పెంచేందుకు అవసరమైన సైన్స్, టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, అభివృద్ధి పరుస్తుంది.

12)  రైతులకు మద్దతు ధర కల్పిస్తాం.

13)  30 ఏళ్ల తర్వాత సింగిల్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అభినందనీయం.

14)  125 కోట్ల ప్రజల నమ్మకాన్ని మా ప్రభుత్వం నిలబెడుతుంది. ప్రభుత్వ విజయంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషిస్తారు.

15)  దేశ ప్రజల రక్షణ విషయంలో వెనకడుగు వేయం. దేశ సరిహద్దులను కాపాడుతాం. భారత భద్రతా దళాలను చూసి గర్విస్తున్నాం. భద్రతాదళాలను మరింత బలోపేతం చేస్తాం.

16)  ఇతర దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత పురోగతి సాధిస్తాం.

17)  ఐదు 'టీ'లపై (ట్రెడిషన్, టాలెంట్, టూరిజం, ట్రేడ్, టెక్నాలజీ) దృష్టి పెడతాం.

18)  ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు 60 నెలల్లో స్పష్టమైన మార్పును చూపెడతాం. అత్యాధునిక, అన్ని విధాలా అభివృద్ధి చెందిన భారత్ ను సాధిస్తాం.

19)  మహిళలపై అత్యాచారాలను, హింసను ఉక్కు పాదంతో అణచివేస్తాం.

20)  బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం అరికడుతుంది.

21)  ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం ప్రభావవంతంగా లేనందున... దీనికి ప్రత్యామ్యాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది.

22)  ప్రతి నీటి బొట్టు విలువైనదే. నీటిని సక్రమంగా వినియోగించే వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది.

23)  ఇంత పెద్ద దేశంలో ప్రశాంతగా ఎన్నికలు జరగడం చాలా గొప్ప విషయం. ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నా.

24)  కుల, మత సరిహద్దులను చెరిపేసి, ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేశారు.

25)  దారిద్ర్యానికి, ఆకలికి మతం, కులం లేదు.

26)  ప్రజల ప్రాథమిక అవసరాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది.

27)  ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ప్రధాన లక్ష్యం.

28)  యోగాకు మరింత ప్రాధాన్యత కల్పిస్తాం.

29)  ప్రతి రాష్ట్రంలో ఐఐటీలు, ఐఐఎంలను ఏర్పాటు చేస్తాం.

30)  వివిధ రహదారులను అనుసంధానించి... మెరుగైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం.

31)  మైనార్టీలను దేశాభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తాం. 'మదర్సాల అభివృద్ధి పథకం' తీసుకు వస్తాం.

32)  బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత.

33) ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం రాష్ట్రాల వారిగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తాం.

34) పార్లమెంటులో మహిళల 33 శాతం రిజర్వేషన్ కు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

35)  పారదర్శక పాలనకు అత్యంత ప్రాధాన్యత.

36)  అవినీతి నిరోధం కోసం లోక్ పాల్ వ్యవస్థ.

37)  అవినీతి రహిత, ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగిన ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేస్తాం.

38)  విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని మన దేశానికి రప్పిస్తాం.

39)  న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. కేసులను త్వరగా ముగించేందుకు న్యాయ వ్యవస్థలో ఖళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను వెంటనే చేపడతాం.

40)  ఈశాన్య రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత. ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లను ఉక్కుపాదంతో అణచివేస్తాం.

41)  టూరిజంను అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధిని మెరుగుపరుస్తాం.

42)  వాణిజ్యాన్ని అభివృద్ధి పరిచేందుకు విధానాలను సరళీకృతం చేస్తాం. ఉద్యోగాలను సృష్టించడానికి అవకాశం ఉన్న చోట విదేశీ పెట్టుబడులను అనుమతిస్తాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles