Chandrababu and kcr arranges special flight for parents

Chandrababu arranges special flight for parents, kcr arranges special flight for parents, special flight For AP Students Parents, AP Students drowned in Himachal Pradesh, AP Students drowned in Beas river, Students mishap in Himachal Pradesh,

Chandrababu and kcr arranges special flight for parents

రంగంలోకి దిగిన బాబు-కేసిఆర్ విమానాలు!

Posted: 06/09/2014 11:03 AM IST
Chandrababu and kcr arranges special flight for parents

హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షించారు. తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విమానంలో చండీఘడ్ వరకు తీసుకెళ్లి... అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఘటనా స్థలికి తీసుకెళ్తామని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు.

60 నుంచి 65 మంది వరకు తల్లిదండ్రులను ఈ విమానంలో తీసుకెళ్తామని తెలిపారు. సతీష్ చంద్ర అనే ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారాలన్నింటినీ సమీక్షిస్తున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గల్లంతైన విద్యార్థుల కోసం సహాయ చర్యలు తీసుకున్నారు. గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులను ఘటనా స్థలికి తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ విమానం చండీఘడ్ వరకు వెళుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో వసతి ఏర్పాటు చేయాలని టీ.ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles