Congress as main opposition in lok sabha

Congress as main opposition in Lok sabha, Congress wins 44 parliamentary seats in 2014 elections, Congress second highest in parliament seats

Congress as main opposition in Lok sabha

ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్?

Posted: 06/04/2014 12:54 PM IST
Congress as main opposition in lok sabha

దేశవ్యాప్తంగా 44 పార్లమెంట్ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా దక్కాలని కర్నాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ విఆర్ సుదర్శన్ అన్నారు.  లోక్ సభకు కాంగ్రెస్ నాయకుడిగా ఎన్నికైన మాజీ కేంద్ర రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గే కి అభినందనలు తెలియజేసిన సుదర్శన్ ఆయనకు ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదా లభించాలని కోరుకున్నారు.  

కాంగ్రెస్ తర్వాత 37 పార్లమెంట్ స్థానాలతో తమిళనాడులో అన్నా డిఎమ్ కే, 34 స్థానాలతో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, 20 స్థానాలతో ఒడిశాలో బిజు జనతా దళ్ గెలుపొందాయి.  ఈ మూడూ కలిసి 91 స్థానాలతో ప్రతిపక్షంగా రిప్రజెంట్ చెయ్యటానికి ఒక ప్రతిపాదన ఉండేది.  ఇప్పుడు అది మళ్ళీ వినపించకపోవటానికి కారణం బహుశా ఎవరి రాష్ట్రంలో వాళ్ళు వ్యస్థులైవుండటమే కావొచ్చు.

main-opposition

ప్రజాస్వామ్య విధానంలో గట్టి ప్రతిపక్షం చాలా అవసరమని సుదర్శన్ అభిప్రాయపడ్డారు.  పోయినసారి భాజపా నేతృత్వంలో నడిచిన ఎన్డియే ప్రభుత్వంలో కర్నాటక రాష్ట్రం సవతి తల్లి ప్రేమను పొందిందని, తిరిగి అలా జరగకూడదని ఆయన హెచ్చరించారు.  రాష్ట్రాలలోని ప్రత్యేక సమస్యలను తెలుసుకోవటం కోసం మోదీ ప్రభుత్వం త్వరలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవటం అవసరమని ఆయన అన్నారు.  

అయితే, మొత్తం స్థానాలలో 10 శాతం సీట్లు లభించిన పార్టీ లేక కూటమినే ప్రధాన ప్రతిపక్ష హోదా వరిస్తుంది.  అంటే కనీసం 55 సీట్లయినా ఉండాలి.  44 సీట్లను మాత్రమే సంపాదించిన కాంగ్రెస్ కి నిజానికి ఆ హోదా వచ్చే అవకాశం లేదు.  అందుకేనేమో ఆ పార్టీ రాహుల్ గాంధీని కాకుండా కర్నాటకకు చెందిన మల్లిఖార్జున ఖర్గే ని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నాయకుడిగా ఎన్నుకుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles