Gopinath munde last rites at his native place parli

Gopinath Munde last rites at his native place Parli, Munde's daughter Pankaja performs last rites, Munde cremation at Vaijnath Sugar Factory at Pangry

Gopinath Munde last rites at his native place Parli

గోపీనాథ్ ముండే అంతిమ యాత్ర పార్లీ లో

Posted: 06/04/2014 10:28 AM IST
Gopinath munde last rites at his native place parli

ఎనిమిది రోజుల క్రితమే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు అమాత్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మంగళవారం ఉదయం ఢిల్లీలోని రోడ్ ప్రమాదంలో మరణించిన గోపీనాథ్ పాండురంగ్ ముండే పార్థివ శరీరాన్ని ఢిల్లీ నుంచి ముంబై కి విమానంలో తరలించి, కాసేపు వోర్లిలో ముండే నివాసం దగ్గర ఉంచి, మంగళవారం రాత్రంతా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదురుగా సందర్శనార్థం ఉంచారు.  

ఈ రోజు ఆంబులెన్స్ లో ఎయిర్ పోర్ట్ కి తరలించి అక్కడి నుండి లాటూర్ ఎయిర్ స్ట్రిప్ కి తరలిస్తారు.  అక్కడి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముండే జన్మస్థలమైన పార్లీ లో ఉదయం 9.00 వరకు అంతిమ దర్శనం కోసం ఉంచి, అక్కడి నుండి అంతిమ యాత్రకు తీసుకుని వెళ్తున్నారు.  

గోపీనాథ్ కుమార్తె, భాజపా ఎమ్మెల్యే పంకజ ఆయనకు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు.  భార్య, ముగ్గురు కూతుళ్ళను వదిలి అనంత లోకాలకు వెళ్ళిన ముండే పార్థివ శరీరానికి పంగ్డీ లో ఆయన వైజ్ నాథ్ సుగర్ ఫాక్టరీ ప్రాంగణంలో అంతిమ సంస్కారం జరుగుతుంది.

64 సంవత్సరాల గోపీనాథ్ ముండే మంగళవారం ఉదయం 6.30 గంటలకు ఢిల్లీలో కారు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా భాజపా నాయకులు ఆయన పార్థివ శరీరానికి నివాళులర్పించారు.

pm-tributes-to-munde

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles