Vultures conservation at coimbattore

Vultures conservation at Coimbattore, Vultures eat carcass and save atmosphere, Vultures extinction feared, Conservation of Vultures help mankind

Vultures conservation at Coimbattore

రాబందులకు రక్షణ

Posted: 06/03/2014 10:30 AM IST
Vultures conservation at coimbattore

రాబందుల గురించి చాలా నీచంగా మాట్లాడుతుంటారు.  ఎందుకంటే అవి శవాలను పీక్కుతినే పక్షిజాతి కాబట్టి.  అవసరానికి మాత్రమే ముఖం చూపించి బంధువుల దగ్గర్నుంచి వీలయినంత ఒడిసిపట్టుకుందామనుకునే వారిని వాళ్ళు బంధువులు కారు రాబందులు అని అంటుంటారు.  చనిపోయిన శవాలనే కాదు, యుద్ధ భూములు, ఎడారులలో చనిపోవటానికి తయారుగా ఉండి లేవలేని స్థితిలో ఉన్నవారిని కూడా ఒక పక్కనుంచి రాబందులు పీక్కుతినటం మొదలుబెట్టేస్తాయి.  అలాంటప్పుడు కంటి ముందే తన శరీరాన్ని తింటున్న రాబందుని ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా నరకం అనుభవిస్తుంటారు.  అందుకే, సమాజంలో బలహీనుడి దగ్గర్నుంచి లాక్కునేవారిని రాబందులతో పోలుస్తారు.  వెయ్యి శవాలను తిన్న రాబందైనా ఒక్క గాలివానకు చచ్చిపోతుందని కూడా అటువంటివారిని అంటుంటారు.

అయితే ప్రకృతిలోని ప్రతి జీవి ఎంతో ప్రణాళికాబద్ధంగా సృష్టించబడిందే.  శవాలు కుళ్ళిపోయి వాతావరణాన్ని కలుషితం కాకుండా చేసే గొప్ప జీవి రాబందు.  కానీ ఈ రాబందు జాతి నశించే సమయం ఆసన్నమైంది.  ప్రకృతిలో ఎక్కడా కనపడకుండా చరిత్రలోనే మిగిలిపోయిన అనేక జీవరాశుల జాబితాలో రాబందు కూడా చేరబోతోంది.  

అందువలన వాటిని కాపాడటానికి ముందడుగు వేసింది ఆరులాగమ్ అనే కోయంబత్తూరుకి చెందిన స్వచ్చంద సంస్థ.  అందుకోసం గ్రామాలలోని ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  వన్య ప్రాణుల రక్షణకోసం ప్రభుత్వం వివిధ ప్రణాళికలు వేస్తోంది కానీ తమ సంస్థ గ్రామీణ ప్రాంతంనుంచి అవగాహనను పెంచి ఆ విధంగా వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నదని ఆరులాగమ్ సంస్థ సెక్రటరీ ఎస్. భారతీ దాసన్ అన్నారు.  

రాబందులు మనుషులను కానీ జంతువులను కానీ ఏమీ చెయ్యవని, చనిపోయిన జంతువుల శవాలను మాత్రమే తింటాయని, అలా చెయ్యకపోతే వాతావరణ ప్రధూషితమై రోగాలు చెలరేగే ప్రమాదమున్నదని, అటువంటి వాటిని నివారించే రాబందులను రక్షించటం మన కర్తవ్యమని కోయంబత్తూరు పంచాయతీ ప్రెసిడెంట్ జయశ్రీ నాగరాజన్ అన్నారు.  

అందువలన రాబందులు లేని చోట ఇతర ప్రాంతాల నుంచి తీసుకునివచ్చైనా అవి అక్కడ గూడు కట్టుకుని నివసించేట్టుగా చెయ్యటం మానవాళికి, వారిమీద ఆధారపడ్డ జంతుజాలానికి మంచి చేస్తుందని నమ్ముతూ కోయంబత్తూర్ లో రాబందుల రక్షణ కోసం కృషిచేస్తున్నారు.

భగవంతుడు సృష్టించిన, మనతో భూమ్మీద జీవిస్తున్న జంతుజాలం మీద ప్రేమ లేకపోయినా కనీసం మనకు అవసరానికి పనిచేస్తున్నాయని తెలిసిన తర్వాతైనా ఆయా జంతు, పక్షిజాలాలను రక్షించటం మంచిదేమో.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles