Kcr swearing in as first cm of telangana

KCR swearing in as first CM of Telangana, Governor Narasimhan swearing in as Telangana Governor, Anurag Sharma Swearing in as Telangana DG of Police, 11 Cabinet Ministers sworn in with KCR

KCR swearing in as first CM of Telangana

ఈ రోజే ఉదయించిన తెలంగాణా తొలి కిరణం!

Posted: 06/02/2014 10:25 AM IST
Kcr swearing in as first cm of telangana

ఈరోజు ఆవిర్భవించిన తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రెడ్డి (కెసిఆర్) ప్రమాణస్వీకారం చేసారు.  అంతకు ముందు తెలంగాణా గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన ఇఎస్ఎల్ నరసింహన్ కెసిఆర్, ఆయనతో పాటు 11 మంది కేబినెట్ మంత్రులచేత ప్రమాణ స్వీకారం చేయించారు.  

తెల్లటి వస్త్రాలు ధరించిన కెసిఆర్ ముందుగా గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.  ఆ తర్వాత అమరవీరుల గన్ పార్క్ లో తెలంగాణా రాష్ట్రం కోసం అమరులైనవారికి పుష్పాలతో నివాళులర్పించారు.  పిదప రాజ్ భవన్ లో కుమారుడు కెటి రావ్, మేనల్లుడు హరీష్ రావులతో కలిసివెళ్ళి తెలుగులో చేసిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ముగించారు.  

తెలంగాణా ప్రభత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారాలు చెయ్యటానికి వీలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రపతి పాలనను సడలించారు.  అందుకు హోం శాఖ అధికారులు నోటిఫికేషన్ ని విడుదల చేసారు.  అయితే తెలంగాణా పోను మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు రాష్ట్రపతి పాలన యథావిధిగా నడుస్తుంది.  

తెలంగాణా మంత్రులలో ఇంతవరకు మహిళలకు స్థానం ఇవ్వలేదు.  మంత్రివర్గంలోకి వస్తారనుకున్న కొప్పుల ఈశ్వర్ క్యాబినెట్ లోకి రాకపోవటంతో ఆయనకు స్పీకర్ పదవినిచ్చే అవకాశం కనిపిస్తోంది.  

ఈరోజు పదవీస్పీకారం చేసిన 29 వ రాష్ట్ర తొలి గవర్నర్ కి ముందుగా తెలంగాణా డెప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ గా అనురాగ్ శర్మ ప్రమాణ స్వీకారం చేసారు.  

కెసిఆర్ ప్రమాణ స్వీకారం అవగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెసిఆర్ ని అభినందిస్తూ, ట్విట్టర్ లో, రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యటానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న హామీనిచ్చారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles