Aap leaders face contempt of court case

AAP leaders face contempt of court case, Contempt of Court on Manish Sisodia and Gopal Rai, Arvind Kejriwal agrees to furnish bail bond

AAP leaders face contempt of court case

ఆఆపా నాయకుల మీద కోర్టు ధిక్కార అభియోగం

Posted: 05/27/2014 05:50 PM IST
Aap leaders face contempt of court case

కోర్టు తీర్పును విమర్శించిన ఆఆపా నాయకుల మీద కేసు ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది.  ఆఆపా కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కి జుడిషియల్ కస్టడీ విధించటం మీద బహిరంగ వ్యాఖ్యానాలు చేసిన ఆఆపా నాయకులు మనీష్ శిసోడియా, గోపాల్ రాయ్ మీద కోర్టు ఉల్లంఘన నేరం కింద జరిగిన అభియోగం విచారణకు రాగా వారిద్దరి నుంచి మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మినోచా దాని మీద వారిని వివరణనీయమని అడిగారు.  

అడ్వకేట్ పంకజ్ మెన్డిరట్టా ఫైల్ చేసిన ఆ కేసులో, ఆఆపా నాయకులు కోర్టు తీర్పును న్యాయబద్ధంగా లేదని, దేశంలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇచ్చిన తీర్పని ఆరోపించారని పేర్కొన్నారు.  కోర్టులో జరిగే న్యాయ విచారణను తక్కువచేసి మాట్లాడుతూ,  న్యాయవ్యవస్థని కించపరచే విధంగా శిసోడియా రాయ్ లు మాట్లాడారని ఆరోపించారు.  బెయిల్ బాండ్ ఇవ్వటానికి నిరాకరించిన నిందితుడిని జైలుకి పంపించటం మీద న్యాయస్థానాల గురించి ప్రజలలో దురభిప్రాయం  కలిగేవిధంగా మాట్లాడారని అభియోగాన్ని మోపారు.

దీని మీద తదుపరి విచారణను కోర్టు జూలై 11 కి వాయిదా వేసింది.  

అయితే ఈరోజు బెయిల్ బాండ్ ఇవ్వటానికి కేజ్రీవాల్ అంగీకరించారు.  తనను జైలులో నిర్బంధించటం మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్ కి బాండ్ కట్టే బయటుకు రావాలని, ఆ తర్వాతే న్యాయపరంగా పోరాడాలని సూచించింది.  దానితో ఆయన బాండ్ ఇవ్వటానికి తయారయ్యారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles