ఈ నెల 26 న నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆసియా దేశాల ముఖ్య నాయకులందరికీ ఆహ్వానం పంపించటం వివాదస్పదంగా మారింది.
శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షాను ఆహ్వానించటం తగదని తమిళనాడులో భాజపా మద్దతు పార్టీ ఎమ్ డి ఎమ్ కే ఛీప్ వైకో ముందు లేఖ రాసి తర్వాత మోదీ రాజ్ నాథ్ సింగ్ లను కలిసి కూడా ఆ విషయాన్ని స్పష్టం చేసారు. మోదీతో భేటీ అయినప్పడు అమిత్ షా, అరుణ్ జైట్లీ కూడా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో కలిసినప్పుడు రాజ్ పక్షాని పిలవటం విషయంలో పునరాలోచన చెయ్యవలసిందిగా మోదీకి చెప్పి ఒప్పించమని కూడా వైకో అడగటం జరిగింది.
రాజ్ పక్షాని భారత్ కి పిలవటం మీద తమిళనాడు భాజపా నాయకులు కూడా అసంతృప్తిని తెలియజేస్తున్నారని వైకో అన్నారు. నిజానికి రాజ్ పక్షా ఢిల్లీకి రావటం కాంగ్రెస్ కి అవకాశమిచ్చినట్లవుతుందని, అప్పుడు శ్రీలంక తమిళియన్లు ఎదుర్కుంటున్న వేధింపులను తెరమీదకు తేవటానికి కాంగ్రెస్ కి వీలు చిక్కుతుందని కూడా ఆయన అన్నారు.
2004 లో కానీ 2009 లో కానీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా చేసిన ప్రమాణస్వీకారానికి రాజ్ పక్షాని పిలవలేదని, అంతకు ముందు అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారనికి కూడా రాజ్ పక్షాని పిలవలేదని వైకో గుర్తుచేసారు.
దక్షిణంలో రాజ్ పక్షా అయితే ఇటు ఉత్తరం దిక్కుగా చూస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ని ఆహ్వానించటం ఆయనను ఇరుకున పడేయటం అయింది. ఆహ్వానాన్ని మన్నించాలా వద్దా అన్ని మీమాంసలో పడి ఈ రోజు ఏ సంగతీ నిర్ణయించుకుని ప్రకటిద్దామనుకున్నారాయన. పొరుగు దేశంతో మైత్రీ సంబంధాలు అవసరమే అయినా, మోదీ పాక్ కి వ్యతిరేకన్న భావన కొన్ని ముస్లిం సంఘాలలో ఉండటం వలన నవాజ్ షరీఫ్ మోదీ కోసం భారత్ కి రావటం ఆ సంఘాలను వ్యతిరేకం చేసుకోవటమవుతుందని నవాజ్ షరీఫ్ ఆలోచిస్తున్నారు.
ఈ లోపులో ఆప్ఘనిస్థాన్ లో భారత్ దౌత్య కార్యాలయం మీద దాడి జరగటంతో పాకిస్తాన్ తో వ్యవహారంలో మోదీ కాఠిన్యాన్ని ప్రదర్శించాలని మాజీ లెఫ్టెనెంట్ జనరల్ రాజ్ కడ్యాన్ కోరుకుంటున్నారు. పాకిస్తాన్ ఆప్ఘనిస్తాన్ ని తన కింద పెట్టుకోవాలని చూస్తోందని, అక్కడ భారత దేశం డేరా వెయ్యటం, ఆ దేశానికి సాయం చెయ్యటం పాక్ కి ఇష్టం లేదని అందుకే దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈసారి దాడిలో భారతీయులెవరికీ నష్టం జరగకపోయినా ఇది మొదటిసారి జరిగిన దాడి కాదు, ఆఖరిదని అనుకోవటానికీ వీల్లేదని కడ్యాన్ అన్నారు.
సామాన్యంగా అటువంటి దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నవారిని గాయపరచటం జరుగుతుందని, అలా అవలేదూ అంటే అప్పటికప్పుడు హడావిడిగా చేసిన ప్రణాళికైయ్యుంటుందని కడ్యాన్ అన్నారు. అది నవాజ్ షరీఫ్ ఆహ్వానంతో ముడిపడిందే అయ్యుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఇరు దేశాలు దగ్గరవటం ఇష్టం లని ఐఎస్ఐ, పాకిస్తాన్ అర్మీలు ఈ దాడి వెనుక ఉండే అవకాశం ఉందని లెఫ్టెనెంట్ జనరల్ కడ్యాన్ తన విశ్లేషణను తెలియజేసారు.
అంతేకాదు, యుపిఏ ప్రభుత్వం మాటలు వాడిగా ఉండి చేతల్లో తుస్సుమనిపించేదని, అలా కాకుండా ఎన్డియే ప్రభుత్వం మాటలు సౌమ్యంగా ఉండి చేతలలో కరకుదనం ఉండాలని, అందువలన ఈ విషయంలో పాకిస్తాన్ కి భారత్ నుంచి వాడైన సంకేతం పోవటం అవసరమని కడ్యాన్ అభిప్రాయపడ్డారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more