Sonia gandhi congratulates narendra modi on his victory

Sonia Gandhi writes to Narendra Modi, Congress President Sonia Gandhi, Sonia Gandhi congratulates Narendra Mod

Sonia Gandhi congratulates Narendra Modi on his victory, Sonia Gandhi writes to Narendra Modi

మోడీకి సోనియా లేఖ!

Posted: 05/23/2014 01:14 PM IST
Sonia gandhi congratulates narendra modi on his victory

సోనియా గాంధీ .. ఈపేరు .. పది సంవత్సరాల నుండి దేశంలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గా సోనియా గాంధీ దేశాన్ని ఎలా పాలించిందో అందరికి తెలుసు. అతి కొద్ది రోజుల్లో అమ్మకు అధికారం దూరం కాబోతుంది. అమ్మ, అబ్బాయి , మౌన మునీ వేసిన అడుగుల ఫలితమే.. అధికారం అందకుండాపోయిందనే విషయం ఆమెకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తీరు చూసి బాధపడిన సోనియా చివరకు.. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బిజేపి పార్టీ వైపు చూస్తుంది.

2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలుపుతూ మోడీకి లేఖ రాసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆ లేఖను బీజేపీ నేతకు పంపినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత మీడియాతో మాట్లాడిన సోనియా, రాహుల్ మోడీకి అభినందనలు తెలపకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే లేఖ రాసినట్లు తెలుస్తోంది. అటు నరేంద్రమోడీకి ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారని, ప్రతిపక్షం నుంచి కూడా అభినందనలు సహజమేనని బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ సోనియా లేఖపై స్పందిస్తూ అన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles