Telugu moive artist kalyan chakravarthy suicide

actor TV Artist Kalyan Chakravarthy no more, sensational TV Artist Kalyan Chakravarthy dies in Hyderabad, telugu TV Artist Kalyan Chakravarthy died today, how did TV Artist Kalyan Chakravarthy die, when did actor TV Artist Kalyan Chakravarthy die, telugu actor TV Artist Kalyan Chakravarthy passes away,TV Artist Kalyan Chakravarthy dead, death newsTV Artist Kalyan Chakravarthy, latest newsTV Artist Kalyan Chakravarthy, latest death newsTV Artist Kalyan Chakravarthy, what isTV Artist Kalyan Chakravarthy latest news, live newsTV Artist Kalyan Chakravarthy

Telugu Moive Artist Kalyan Chakravarthy suicide

సినీ నటుడు కల్యాణ్ సూసైడ్...

Posted: 05/22/2014 08:43 AM IST
Telugu moive artist kalyan chakravarthy suicide

కేవలం 30 సంవత్సరాల కూడా ఇంకా నిండలేదు. కానీ తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. సినీ నటుడు కల్యాణ్ చక్రవర్తి సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు తీరాని క్షోభ మిల్చిచాడు. ఈ సంఘటన రాష్ట్ర సినీలోకాన్ని కలవరపర్చింది.సినీ నటుడు కల్యాణ్ చక్రవర్తి తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భీమవరం ప్రాంతానికి చెందిన కొత్తపల్లి కల్యాణ్ చక్రవర్తి సినీ ఆర్టిస్టుగా ఎదిగాడు.

అతను నాలుగు సినిమాల్లో నటించాడు. ఒక చిత్రం, కథ, గుండెల్లో గోదారి, లక్ష్మీకళ్యాణం అనే సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సినిమాల్లో సరైన అవకాశాలు లేకపోవడంతో లయ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్‌లో నటిస్తున్నారు. ఇటీవల భీమవరంలో కల్యాణ్ చక్రవర్తి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడని తల్లిదండ్రులు సురేన్ బాబు, కనకదుర్గ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీలో చురుకుగా పాల్గొని ప్రచారాలు నిర్వహించారని చెప్పారు.

ఏమైందో ఏమో గాని రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన కల్యాణ్ చక్రవర్తి తన బెండ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుని నిద్రపోయాడని తల్లిదండ్రులు తెలిపారు. తెల్లవారుజామున కల్యాణ్ చక్రవర్తి బెడ్ షీట్‌తో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉదయం నిద్రలేపేందుకు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన వారు కిటికీలు తెరిచి చూడగా కల్యాణ్ చక్రవర్తి ఉరివేసుకుని వేలాడటం చూశారు. ఒక్కసారిగా వారు భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఈ విషయం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులు కారణమా అని పోలీసులు ప్రశ్నించినా తమకు డబ్బుకు కొరత లేదని, తల్లిదండ్రులు సమాధానం చెప్పారు. అయితే మృతదేహాన్ని పంచనామా నిర్వహించిన భీమవరం వన్ టౌన్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసుస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles