15th loksabha to end today

15th Loksabha to end today, Prime Minister Manmohan Singh last cabinet meet, President to cancel Loksabha

15th Loksabha to end today

15 వ లోక్ సభ రద్దు, 14 వ ప్రధానమంత్రికి స్వాగతం

Posted: 05/17/2014 10:19 AM IST
15th loksabha to end today

16వ లోక్ సభ ఎన్నికలు పూర్తైన సందర్భంగా 15వ లోక్ సభను రద్దుచెయ్యటానికి ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఆఖరి క్యాబినెట్ సమావేశం జరుగుతోంది.  15వ లోక్ సభను రద్దుచెయ్యమని కోరుతూ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఈరోజు కోరటం జరుగుతుంది.  క్యాబినెట్ సమావేశానంతరం పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమలనాధ్ రాష్ట్రపతిని కలుస్తారు.  అందుకు ఆయనకు రాష్ట్రపతి 1.45 కి సమయం ఇచ్చారు.  

14 వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం తీసుకునే నరేంద్ర మోదీ అందుకు ఈ నెల 21న అందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది.  283 భాజపా పార్లమెంటు సభ్యులతో కలిపి మొత్తం 337 ఎన్డియే పార్లమెంట్ సభ్యులతో 16 వ లోక్ సభ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటానికి కావలసినంత మెజారిటీతో ఎన్నికలలో విజయం పొందిన సందర్భంగా ఈరోజు ఆయన ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొని, ఆ తర్వాత అగ్రనాయకులతో భేటీ అవటానికి ఢిల్లీ వెళ్ళారు.  అందుకోసం ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు ముందుగానే జారీచేసారు.  

ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు భాజపా అగ్రనాయకులందరూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  అందులో ఒకటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరిని నిలబెట్టాలి అన్నది.  ఎందుకంటే ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ ఇక ప్రధానమంత్రిగా అధికారిక నివాసం ఢిల్లీలో 7 రేస్ కోర్స్ కి తన బసను మార్చనున్నారు.   పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో 12 మంది అగ్రనాయకులు మంత్రులుగా ఎవరిని నియమించాలి, వారికి ఏయే పోర్ట్ ఫోలియోలను కేటాయించాలన్నదానిలో నిర్ణయాలు తీసుకుంటారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles