తెలంగాణా పోగా మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో కెరటంలా వస్తానని అన్న వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కి అడ్డుపడింది ఎవరు? ఆ కెరటం రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా ఎందుకు లేచింది?
గతంలో తన సర్వే నివేదికలతో రాజకీయ రంగంలో విశ్వసనీయతను గడించిన లగడపాటి రాజగోపాల్ తాజాగా 2014 ఎన్నికల ఫలితాల మీద చేసిన సర్వే ఆధారంగా ఇచ్చిన ఫలితాలను బట్టి చూసినా తెలుగు దేశం పార్టీ సీమాంధ్రలో అఖండ విజయాన్ని సాధిస్తోంది.
పరిషత్ ఎన్నికల ఫలితాలను చూసినా తెదేపా ప్రభంజనం కనిపిస్తోందంటే అందుకు కారణమేమిటి? పల్లెల్లో పట్నాలలో కూడా జగన్ కి బ్రహ్మరథం పట్టిన వారు ఒక్కసారిగా ఎలా మారిపోయారు? ఆ మార్పుని తీసుకునివచ్చిందెవరు?
తెదేపా గెలుపుకి దోహదం చేసినవారు ఇద్దరే కనిపిస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోది హవా, రాష్ట్రంలో విభిన్న రీతిలో రాజకీయ రంగ ప్రవేశం చేసి జనసేన పార్టీని స్థాపించి, మోదీ తెలుగు దేశం పార్టీలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్!
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగు దేశం పార్టీకి మొదట్లో తన సొంత పార్టీలోను, భాజపా రాష్ట్ర నాయకులతోను విభేదాలు కనిపించాయి. సీట్ల సర్దుబాటులో కూడా భాజపాతో విభేదం వచ్చింది. పైగా జాతీయ స్థాయిలో పనిచేస్తున్న భాజపా ప్రధాని అభ్యర్థి మోదీ ప్రభావం దేశం మొత్తం ఉండటం వలన రాష్ట్రంలో అంత ఎక్కువగా ఉండదు. అందువలన తేదేపా విజయానికి రాష్ట్ర స్థాయిలో పనిచేసిన పవన్ కళ్యాణ్ ప్రభావమే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ విషయం తెలుసు కనుకనే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా అభినందించి ఆయనను విందుకు ఆహ్వానించారు.
నేను ఇది చేస్తాను అని చెప్పటమే కాని, ఇంత చేసాను, ఆ ఫలితంలో నా వాటా ఇంత, నా భాగస్వామ్యం అంత అని చెప్పే అలవాటు లేని పవన్ కళ్యాణ్ కేవలం తనవంతు సాయంగా ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. ఆయన అభిమాని మోదియే అయినా, భాజపాతో చెలిమిచేసిన తెదేపాకు కూడా పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ మద్దతంటే కేవలం తెలుగు సినిమాలో అగ్రస్థాయికి చేరిన హీరో వ్యక్తిగత మద్దతు కాదు. నిస్వార్థంగా, అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తుందని ప్రకటిస్తూ స్థాపించిన జనసేన పార్టీతోపాటు, కోటానుకోట్ల పవన్ అభిమానుల మద్దతును కూడా కూడగట్టుకున్నట్లే!
ఎవరూ సాహసించని రీతిలో తెలంగాణాలో కెసిఆర్, సీమాంధ్రలో జగన్ అవినీతి గురించి ఎలుగెత్తి చెప్తూ, వైయస్ఆర్ కాంగ్రెస్ కి అధికారమిస్తే రాష్ట్రంలో దోపిడీయే నంటూ తన ఉద్విగ్వ భరిత ప్రసంగాలలో పవన్ కళ్యాణ్ జగన్ మీద మాటలతో దాడిచేసారు. దానివలన బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అయినా తనకేమీ భయం లేదని, అన్నిటికీ సిద్ధపడే రాజకీయాలలోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని మించి జగన్ మీద అంతెత్తున లేచారు. ఆ కెరటమే సీమాంధ్రలో జగన్ ఆశించిన కెరటాన్ని అడ్డుకుంది, అంతకు ముందు జగన్ తో పాటుగా వైయస్ షర్మిల, వైయస్ విజయమ్మల ప్రసంగాలకు వచ్చిన అశేష ప్రజానీకం కూడా మరోసారి ఆలోచించేట్టుగా చేసింది పవన్ కళ్యాణే!
జపించింది రామనామమైనా ప్రత్యక్షంగా లంకకు పోయి చూసిరమ్మంటే కాల్చి వచ్చింది మాత్రం రామభక్తుడైన పవనపుత్ర హనుమాన్ అయినట్లుగా మోదీ మీద అనన్యమైన విశ్వాసంతో పూర్తి మద్దతునివ్వటానికి సిద్ధపడ్డ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి పట్టం కట్టటానికి తన పూర్తి శక్తియుక్తులను ఉపయోగించారనటంలో అతిశయోక్తి లేదు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more