Engineers and technicians in bel

Engineers and Technicians in BEL, Employment opportunity in BEL, Bharat Electronics limited, Vacancies in BEL, Jobs in BEL

Engineers and Technicians in BEL

బిఇఎల్ లో ఇంజినీర్లు, టెక్నిషియన్లు

Posted: 05/09/2014 11:10 AM IST
Engineers and technicians in bel

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఈ క్రింది పోస్ట్ లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.

1.    టెక్నిషియన్ (ఫిట్టర్)  ఖాళీలు 5.  ఎస్ సి-1, ఓబిసి-1, రిజర్వేషన్ లేనివి-3
2.    ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ  ఖాళీలు 3.  ఎసి సి-1, ఓబిసి-1, రిజర్వేషన్ లేనివి-1

వయోపరిమితి

ఏప్రిల్ 1, 2014 నాటికి 28 సంవత్సరాలు మించరాదు.  ఈ వయో పరిమితిని ఓబిసికి 3 సంవత్సరాలు, ఎస్ సి లకు 5 సంవత్సరాలు సడలించటమైనది.

విద్యార్హతలు

1.    టెక్నిషియన్- ఐటిఐ, ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ లేదా 3 సంవత్సరాల అప్రెంటిస్ షిప్ సర్టిఫికేట్ కోర్స్
2.    ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ- పూర్తిగా 3 సంవత్సరాల ఇంజినీరింగ్ లో డిప్లోమా.

అర్హతలు

జనరల్, ఓబిసి అభ్యర్థులు అన్ని సంవత్సరాలు, అన్ని సెమిస్టర్లలో అగ్రెగేట్ న కనీసం 60 శాతం మార్కులను, ఐటిఐ, డిప్లోమా కంటే ఎక్కువ విద్యార్హత కలిగివున్నా ఎస్ సి అభ్యర్థులైనా 50 శాతం మార్కులను సంపాదించుకునివుండాలి.  
కర్నాటక ఎంప్లోయ్ మెంట్ లో రిజిస్టర్ చేసుకునివుండి కన్నడ భాష వచ్చివుండటం తప్పనిసరి.

ఎంపిక

షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవటం జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబిసి అభ్యర్థులకు రూ.300.00.  ఎస్ సి అభ్యర్థులకు ఫీజు లేదు.  ఫీజు చెల్లించవలసినవారు రూ.300.00 తో పాటు రూ.25.00 బ్యాంక్ ఛార్జ్ చెల్లించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలాన్ తీసుకుని పంపించవలసివుంటుంది.

దరఖాస్తు చేసుకోవలసిన విధానం

పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్ తో పాటు అన్ని సంవత్సరాల, సెమిస్టర్ల మార్కుల కార్డ్, ఇతర సంబంధిత డాక్యుమెంట్ల ఫోటో కాపీలను జతపరచి ఆర్డినరీ పోస్ట్ లో ఈ క్రింది చిరునామాకు పంపించవలసివుంటుంది.


Deputy Manager (HR/Central), Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore 560 013

దరఖాస్తు పంపటానికి అఖరు తేదీ-  27.05.2014

అప్లికేషన్ ఫామ్, ఇతర వివరాలకు- http://www.bel-india.com/recruitment

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles