Ysrcp workers resorted to rigging and violence

ysrcp workers resorted to rigging and violence, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

ysrcp workers resorted to rigging and violence

వైకాపా కార్యకర్తలు సృష్టించిన విధ్వంసం

Posted: 05/07/2014 03:33 PM IST
Ysrcp workers resorted to rigging and violence

సీమాంధ్రలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దౌర్జన్యకాండలు ఈ విధంగా ఉన్నాయి.

నెల్లూరు వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో రిగ్గింగ్ జరిగింది.  ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుంటే దాన్ని చిత్రీకరించబోయిన మీడియాను అధికారులే అడ్డుకున్నారు. దానితో యదేచ్ఛగా రిగ్గింగ్ సాగింది.  

చంద్రగిరి నియోజకవర్గంలోని నడవలూరులో ఎన్నికల అధికారి మీదనే దాడిచెయ్యటంతో వాళ్ళు కాసేపు పోలింగ్ ని నిలిపివేసారు.  దాన్ని చిత్రీకరించబోయిన మీడియా ప్రతినిధుల మీద వైకాపా కార్యకర్తలు దాడి చేసి వాళ్ళ దగ్గర్నుంచి కేమెరాలను లాక్కోబోయారు.

చంద్రగిరిలో పోలింగ్ బూత్ లో వైకాపా ఏజెంట్ గా హోంగార్డ్ నియమించబడ్డాడు.  తెలుగు దేశం పార్టీ ఫిర్యాదు చెయ్యగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Police-Constable-hurted-at-Polling

కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో అడిషనల్ ఎస్పీ అప్పలనాయుడు మీద వైకాపా కార్యకర్తలు దాడిచేసారు. అదే మండలంలో ఎనిమిది గ్రామాలలో తెదేపా ఏజెంట్లు లేకపోవటంతో ఎన్నికలు ఏకపక్షమయ్యాయి.  ఆ గ్రామాలు, గొరిగనూరు, ధర్మాపురం, దానవులపాడు, సుగుమంచిపల్లి, సున్నపురాళ్ళపల్లి, దేవగుడి, పెద్ద దండ్లూరు.

TDP-Rama-Subba-Reddy-Attacked

కడప జిల్లా జమ్మలమడుగు తెలుగు దేశం పార్టీ అభ్యర్థి రామ సుబ్బారెడ్డి మీద దాడిచేసిన వైకాపా కార్యకర్తలు గోరిగనూరు పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా కూర్చోబెడదామనుకుని తీసుకునివెళ్తున్న వారిని అపహరించుకుని పోయారు.

TDP-Rama-Subba-Reddy-Car-Destroyed

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం జె కొత్తపల్లిలో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర యాదవ్ ఇంటి మీద దాడి చెయ్యగా ఆయన కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.

TDP-Putta-Sudhakar-Yadav

కడప జిల్లా చాపాడు మండలం  వెదురూరులో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ కారు మీద రాళ్ళ దాడిచేసారు.

TDP-Putta-Sudhakar-Yadav-Car-Destroyed

కడప జిల్లా రాజంపేట మండలంలో బాలరాజు పల్లె, పెద్దూరు పోలింగ్ బూత్ లలో తెదేపా ఏజెంట్ల మీద వైకాపాకి చెందిన గ్రామ సర్పంచి పుర్రు నాగేశ్వరరావు మారణాయుధాలతో దాడిచేసారు.  ఆ దాడిలో తెదేపా గాయపడిన ఏజెంట్లు, కార్యకర్తలు- వెంకటరామరాజు, సీతారామరాజు, రఘురామరాజు, బలరామరాజు, కృష్ణమనాయుడు.  వాళ్ళని హాస్పిటల్ తరలిస్తుండగా వైకాపా కార్యకర్తలు వాహనం మీద మరోసారి దాడిచేసారు.

అనంతపురం జిల్లా ముదిగుబ్బలో వైకాపా నేత పెద్దిరెడ్డి పోలింగ్ బూత్ లో ఉన్న తెదేపా ఏజెంట్లను బెదిరించారు.   

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆరు గ్రామాలలో తెదేపా ఏజెంట్లు లేక ఎన్నికలు ఏకపక్షమయ్యాయి.  ఆ గ్రామాలు- రంగారెడ్డి పాలెం, బసికాపురం, ఉప్పలపాడు, బుచ్చివారిపాలెం, రామిరెడ్డి పాలెం, రొంపిచర్ల.  తెదేపా ఏజెంట్లను పోలింగ్ బూత్ లోంచి గెంటేసారు.

నరసరావు పేట తెదేపా అభ్యర్థి రాయపాటి సాంబశివరావు వాహనం మీద, ఆయన అనుచరుల మీద వైకాపా కార్యకర్తలు దాడిచేసారు.

ప్రాంతీయ సాక్షి కార్యాలయాలకు పిలిచి వోటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న వైకాపా నాయకులు దొరికిపోయారు.

People-at-Sakshi-Office-Krishna-Dist

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles