Evms out of order at many polling booths

EVMs out of order at many polling booths, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

EVMs out of order at many polling booths

సమయం చూసి మొరాయిస్తున్న ఇవిఎమ్ లు

Posted: 05/07/2014 09:34 AM IST
Evms out of order at many polling booths

ఈ రోజు సీమాంధ్రలో జరుగుతున్న ఎన్నికల్లో చాలా చోట్ల ఇవిఎమ్ లు పనిచెయ్యకుండా మొరాయిస్తూ వోటింగ్ కి అంతరాయం కలిగిస్తున్నాయి.  క్యూలో నిలబడి నిలబడి చివరకు వెనుదిరిగిన వోటర్లున్నారు.  అధికారులు వాటి మరమ్మతులను చేయిస్తున్నారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మాగల్లులో రెండు పోలింగ్ కేంద్రాలలోను, గుంటూరు జిల్లా వినుకొండలో రెండు పోలింగ్ కేంద్రాలలోను ఇవిఎమ్ లు పనిచెయ్యక వోటర్లు క్యూలలో నిలబడి వేచిచూస్తున్నారు.  వినుకొండలో ఒక పోలింగ్ స్టేషన్ కి సిబ్బంది ఆలస్యంగా చేరుకోవటంతో ఉదయం 7.00 కే ప్రారంభమైన వోటర్ల క్యూ బాగా పెరిగిపోయింది.  

కర్నూల్ జిల్లా రుద్రవరంలోనూ ఇదే పరిస్థితి.  ఏకంగా ఆరు పోలింగ్ కేంద్రాలలో ఇవిఎమ్ లు పనచెయ్యటం లేదు.  దానితో ఎండ పెరగక ముందే పని కానిద్దామని వచ్చిన వోటర్లు క్యూలో ఇబ్బంది పడుతున్నారు.  పోనీ వెళ్ళిపోయి మళ్ళీ వద్దామా అంటే ఇంత సేపు ఉన్న సమయం వృధా అవుతుందేమో, ఏమో ఏ క్షణమైనా మెషీన్లు బాగు పడవచ్చేమో అని ఎదురు చూస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles