Tpcc president ponnala criticizes kcr

TPCC President Ponnala criticizes KCR, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

TPCC President Ponnala criticizes KCR

పొన్నాల పొంతనలేని మాటలు

Posted: 05/06/2014 11:41 AM IST
Tpcc president ponnala criticizes kcr

తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోమవారం గాంధీ భవన్ లో మాట్లాడుతూ, కెసిఆర్ మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు.  తెలంగాణా రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని చెప్తున్న కెసిఆర్ మాటలను ఎవరూ నమ్మరని పొన్నాల అన్నారు.  

కెసిఆర్ మాటలను ఎవరూ నమ్మకపోతే కాంగ్రెస్ కి మంచిదేగా!  అందులో విచారపడేదేముంది?  పైగా ఎన్నికలైపోయిన తర్వాత ఎవరు నమ్మినా నమ్మకపోయినా కలిగే తేడా ఏముంటుంది?  వోటర్ నిర్ణయం ఇప్పటికే ఇవిఎమ్ లలో నిక్షిప్తమైవుంది.  అది ఇప్పుడు ఎవరైనా నమ్మటం నమ్మకపోవటంతో మారిపోతుందా? 

కెసిఆర్ ని సంబోధిస్తూ, "నీ మాటలు నమ్మేదెవరయ్యా, ఏనాడైనా మాట మీద నిలబడ్డావా?" అని ప్రశ్నించారు పొన్నాల.  మిగతా మాటలు ఏమైనా, కాంగ్రెస్ పార్టీలో విలీనం విషయంలోను, కనీసం ఎన్నికల పొత్తు విషయంలోనూ కెసిఆర్ తనిచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్న బాధ అందులో ధ్వనిస్తోంది.

ఎత్తిపొడుపులు, పరస్పర ధూషణలు మామూలైపోయిన ఎన్నికల నేపధ్యంలో కెసిఆర్ ఒక తుపాకీ రాముడని, పండగ సమయంలో వచ్చి పాటలు పాడుతాడని, అదే విధంగా కెసిఆర్ కూడా ఎన్నికల సమయంలో తుపాకీ రాముడి అవతారం ఎత్తుతాడని అని చెప్తూ తన అక్కసును వెళ్ళగక్కుకున్నారు పొన్నాల.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles