Poll campaign to end in seemandhra today

Seemandhra election, Seemandhra election 2014, election campaign today end, campaign today end in seemandhra, 2014 election, tdp, ysrcp, janasena, pawan kalyan.

Poll Campaign to end in Seemandhra Today

కొన్ని గంటల్లో కురుక్షేత్రానికి తెరపడనుంది?

Posted: 05/05/2014 08:35 AM IST
Poll campaign to end in seemandhra today

సీమాంధ్రలో ఎన్నికల కురుక్షేత్రం తుదిదశకు చేరుకుంది. కొన్నిగంటల్లోనే ప్రచారానికి తెరపడనుంది. 23 రోజులుగా ప్రచారంతో హోరెత్తించిన నేతల మైకులు నేటి సాయంత్రం నుంచి మూగపోనున్నాయి. పోలింగ్‌కు 48 గంటల ముందు అన్ని రకాల ప్రచారాలు నిలిచిపోనున్నాయి. సీమాంధ్రలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మాటల యుద్ధంతో హోరెత్తిస్తున్న ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనుంది.

సీమాంధ్రలో మండుటెండలను సైతం లెక్క చేయకుండా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్, కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ సిఎం, జైసమైక్యాంధ్ర పార్టీ నాయకుడు కిరణ్ సహా పలువురు అగ్రనాయకులు ప్రతి రోజూ ఎన్నికల ప్రచార సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

నాయకుల టూర్లతో సీమాంధ్రలోని పట్టణాలు, పల్లెల్లో సందడి నెలకొంది. హేమాహేమీల రాకతో ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంది. ఒకవైపు ప్రచారపర్వం ముగుస్తున్నా నేతల విమర్శలు, ప్రతి విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నికల సాక్షిగా పలు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకున్నారు. తమ ప్రసంగాలతో కాక పుట్టిస్తున్నారు. చివరి క్షణంలో వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. హామీల జల్లు కురిపిస్తూ దూసుకెళ్తున్నారు.

సీమాంధ్రలో మే ఏడో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా జరిగే పోలింగ్‌లో 3.68 కోట్లకు పైచిలుకు ప్రజలు వారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా టిడిపి-బిజెపి కూటమికి మద్దతుగా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి చంద్రబాబు, పవన్‌లతో కలిసి గతవారం సీమాంధ్రలో ఆరు ప్రచార సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

అయితే బూత్‌ స్థాయిలో జరిగే రాజకీయ సమీకరణలు, గల్లీ నాయకులతో చేసుకునే బేరసారాలు చాలామంది అభ్యర్థుల అంచనాలను, జాతకాలను నిర్ణయించబోతున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles