Possible mh 370 plane wreckage in bay of bengal

Possible MH 370 plane wreckage in Bay of Bengal, Missing Malaysian place MH 370, MH 370 Malaysia to Beijing, MH 370 missed from March 8

Possible MH 370 plane wreckage in Bay of Bengal

బంగాళా ఖాతంలో MH 370 విమాన శకలాలు?

Posted: 04/29/2014 03:50 PM IST
Possible mh 370 plane wreckage in bay of bengal

మార్చి 8 న మలేషియా నుంచి బీజింగ్ కి బయల్దేరిన మలేషయాకు చెందిన పౌర విమానం ఎమ్ హెచ్ 370 ఆచూకీ ఇంతవరకు ఇదమిద్ధంగా తెలియలేదు.  239 మందితో అదృశ్యమైన ఆ విమానం జాడ తెలుసుకోవటం కోసం 39 దేశాలు వివిధ సాంకేతిక పరికరాలతో రెండు లక్షల చదరపు మైళ్ళలో వెదికారు.  సముద్రం గర్భంలో కూడా ఏవో సంకేతాలు వస్తున్నాయంటూ కనిపెట్టటానికి ప్రయత్నించి విఫలమయ్యారు.  ఎప్పటికప్పుడు ఏదో ఒక చిన్న ఆశాకిరణం కనిపించినట్లే కనిపించి అది కూడా అదృశ్యమైపోవటం జరుగుతూ వస్తోంది.

సముద్రంలో అన్వేషణ చేసే ఆస్ట్రేలియా దేశానికి చెందిన జియో రిసోనెన్స్ అనే ఒక సంస్థ విమాన శకలాలను బంగాళా ఖాతంలో గమనించామని చెప్తోంది.  ప్రస్తుతం వెతుకున్న ప్రదేశం హిందూమహా సముద్రంలో ఇప్పుడు శకలాలలను కనుగొన్నామన్న ప్రాంతానికి 5000 కిలో మీటర్ల దూరంలో ఉంది.  మార్చి 10 నుంచి తమంతట తాము గల్లంతైన ఆ విమానం కోసం వెతుకుతున్నామని, చివరకు ఆ విమాన శకలాలను బంగాళా ఖాతంలో కనిపెట్టామని చెప్తోందా సంస్థ.  

విమానం కూలిపోవటానికి ఆస్కారమున్న 20 లక్షల కిలీమీటర్ల చదరపు స్థలంలో వెతకటం జరిగిందని, ఇందులో న్యూక్లియర్ వార్ హెడ్స్, జలాంతర్గాములను కనిపెట్టే సాంకేతిక విధానాన్ని ఉపయోగించామని జియో రిసోనెన్స్ చెప్తోంది.  

జియో రిసోనెన్స్ సంస్థ అధికార ప్రతినిధి డేవిడ్ పోప్ మాట్లాడుతూ, ఆ శకలాలు మార్చి 5 న తీసిన ఫొటోల్లో లేవని  అంటే మార్చి 8 న మాయమైన విమానానికి చెందినవవటానికి ఆస్కారం ఉందని, అంత మాత్రం చేత కచ్చితంగా అదే విమానానికి చెందిన శకలాలని చెప్పటం లేదని, వాటిని సరిచూసుకోవలసిందిగా కోరుతున్నామని అన్నారు.  

అయితే మలేషియాకి చెందిన సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ అజరుద్దీన్ అబ్దుల్ రెహమాన్ ఈ సమాచారం తమకింకా చేరలేదని, నిజానిజాలు తేల్చవలసిన అవసరం ఉందని అన్నారు.

ఇప్పటికీ అంతులేని కథలా రకరకాల ఆశావహుల కథనాలతో విచిత్రంగా అదృశ్యమైన విమానం రహస్యం ఛేదించినట్లు కాదని తెలుస్తోంది.  ప్రస్తుతం కనిపించిన శకలాలను గుర్తించి అవే ఎమ్ హెచ్ 370 కి చెందినవని ధృవీకరణ జరిగే వరకు వీటిని కూడా నమ్మటానికి వీల్లేకుండా ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles