Voters day in telangana

Voters day in Telangana, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

Voters day in Telangana

మూగబోయిన నాయకుల స్వరాలు!

Posted: 04/29/2014 07:44 AM IST
Voters day in telangana

సోమవారం సాయంత్రం 4.00 నుంచి ఎన్నికల నియమావళి ప్రకారం తెలంగాణా ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి స్వస్థి పలికారు రాజకీయ నాయకులు.  ఈ రోజు వోటర్ల రోజు.  ఇన్నాళ్ళూ అలుపెరుగకుండా హామీలు, ఇతర పార్టీల మీద విమర్శలు చేసిన నాయకుల స్వరాలు మూగబోయిన రోజు.  ఈ రోజు వోటర్లను వాళ్ళంతవాళ్ళు ఆలోచించుకోవటానికి రాజ్యాంగం ఇచ్చిన సమయం.  ఐదేళ్ళపాటు పాలించమని ఎవరికి పట్టం కట్టాలి, ఎవరికి వద్దు, లేదా ఎవరికీ వద్దా (నోటా) అన్న నిర్ణయం తీసుకోవటానికి ఎన్నికల కమిషన్ కలిగించిన వెసులుబాటు.

మాట్లాడవద్దంటే సైగలు చెయ్యమని కూడా కాదు.  కరపత్రాలు పంచటం కానీ మరేవిధమైన ప్రచారానికీ దిగగూడదు.  ఈ సారి రెండు రోజుల ముందుగానే మద్యం దుకాణాలను కూడా మూసివేయించారు.  అయితే నిలవచేసిన మద్యం పంపిణీ జరగకుండ, నగదు కాని వస్తువలతో కానీ వోటర్లను ప్రలోభపెట్టకుండా ఉండటం కోసం ఎన్నికల కమిషన్ నిఘా పెడుతోంది.

నాయకులు తమవంతు ప్రయాస తాము పడ్డారు.  తమ గురించి తాము చెప్పుకున్నదానికంటే ఇతరులలో తప్పులను ఎత్తి చూపించటానికే ఎక్కువ శ్రమపడ్డారు.  అందుకు కావలసిన భోగట్టా సంపాదించారు.  ఇదీ ఒక విధంగా వోటర్లకు మంచి చెయ్యటమే అవుతుంది.  అందరి నాయకుల లోపాలు కూడా బయటపడ్డాయి.  ఇక ఆ లోపాలు, వారు చేసిన మంచి, గత చరిత్రను, గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని వోటరు దేవుళ్ళు ఎవరిని గద్దెక్కించాలో నిర్ణయించుకుంటారు.  ఐదు సంవత్సరాలు నాయకుల రోజులైతే, ఈ ఒక్క రోజు వోటర్లది. 

విల్లులోంచి సంధించే బాణం లాంటిదా వోటు హక్కు.  విడిచిన తర్వాత బాణం వెనక్కి రాదు మళ్ళీ.  అందువలన దాన్ని విల్లునుంచి వదిలే ముందే వోటర్లు ఆలోచించుకోవలసి వుంటుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles