Pawan kalyan strong warning totrs chief kcr

Pawan Kalyan,Kcr, Pawan Kalyan Strong Warning to KCR, pawankalyan hero, pawankalyan janasena party president, warangal road show, pawankalyan attend, kcr trs president, election 2014.

Pawan Kalyan Strong Warning toTrs Chief KCR, Pawan Kalyan Strong Warning to KCR

దొర...! నీ తాట తీస్తా? పవన్ కల్యాణ్

Posted: 04/27/2014 08:30 AM IST
Pawan kalyan strong warning totrs chief kcr

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ ( ఓ దోర) ! నీ తాట తీస్తా. నీ దురహంకారంతో దేశానికి కాబోయే మొదటి బీసీ ప్రధానిని నిందిస్తే చూస్తూ ఊరుకోం...వరంగల్ నడిబొడ్డు నుంచి హెచ్చరిస్తున్నా’’ అంటూ పవన్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో ఆవేశంతో హెచ్చరించారు. 

దేశానికి ప్రధాని కాబోయే నరేంద్ర మోడీని ఉద్దేశించి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ‘మోడీ, బీడీ’ అని నోటికి వచ్చినట్లు వాగితే సహించబోనని హెచ్చరించారు.

 

“కేసీఆర్! నువ్వు నన్ను ఏమన్నా సహిస్తాను. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి చెప్పట్టబోతున్న బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ఏమయినా అంటే మేము సహించను. ఆయన గురించి చులకనగా మాట్లాడితే నీ తాట తీస్తాను! ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోనని తీవ్రంగా హెచ్చరించారు.

తెలంగాణ అభివృద్ధి కంటే ఆయన కుటుంబసభ్యులకు పదవులు, ఆస్తుల సంపాదనే ముఖ్యమన్నారు. బేటా, బేటీ, దామాద్ పద్ధతిలో కేసీఆర్ దందా కొనసాగుతుందని ఆరోపించారు.
కేసీఆర్ కుటుంబ దందాలను ప్రజలు గమనించాలని పవన్ కల్యాణ్ కోరారు.

* కేటీఆర్ గుంటూరు జిల్లాలో చదువుకున్నారని, తెలంగాణలో ఆంధ్రవారిని విమర్శిస్తూ ఆంధ్రకు వెళ్లిన తర్వాత.. అలా తిట్టడం మామూలేనని చెబుతూ వారితో కలిసి దందాలు చేసిన వ్యక్తి కేటీఆర్ అని దుయ్యబట్టారు.

* కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణతో హరీశ్ కేబు ల్ బిజినెస్ ఎలా చేస్తున్నారని నిలదీశారు.

* కేసీఆర్ కుమార్తె కవిత వసూలు చేసిన డబ్బుకు లెక్కేలేదన్నారు.

తాను వైఎస్ భూదందాలపైనా గొంతెత్తానని గుర్తు చేశారు. తెలంగాణకు ఎవరు అన్యాయం చేసినా ప్రశ్నిస్తానని ప్రకటించారు. తెలంగాణ అంటే తనకెంతో ఇష్టమని, ఆంధ్రాలో జన్మిస్తే.. ఇక్కడే పునర్జన్మ పొందానని చెప్పారు. తెలంగాణ పోరాటం సమయంలో సినీ నటుడిగా తాను నాలుగు గోడల మధ్య కూర్చొని తెలంగాణ కోసం ఆలోచించానని తెలిపారు. టీఆర్ఎస్‌కు చెందినవారు తన మామిడి తోటపై దాడి చేసి పశువులను సైతం చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమాకు తీన్‌మార్ టైటిల్ పెట్టవద్దని బెదిరించారన్నారు. సినిమా రీళ్లను తగులపెట్టినప్పటికీ నోరు విప్పలేదని పేర్కొన్నారు. అయితే అది కేసీఆర్ కుటుంబానికి భయపడికాదని, ప్రజల కోసం మౌనం వహించానని చెప్పారు.

 

కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ ఏర్పడలేదని, ఇద్దరు ఎంపీలుంటే ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో యువకుల పోరాటం, ఎర్రబెల్లి లాంటి తెలంగాణ వాదుల పోరాటంవల్లే వచ్చిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించి తెలంగాణ ఏర్పడ్డాక తానే సీఎం కావాలని ఆరాటపడుతున్నారంటూ దుయ్యబట్టారు. తానె క్కడికి వెళ్లినా విప్లవకారుడు చేగువేరా పుస్తకం తనవెంట ఉంటుందన్నారు. మనిషిని ప్రేమించడానికి కులం, ప్రాం తం, మతం అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం, దేశం నుంచి కాంగ్రెస్‌ను సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు.

కేసీఆర్ తనను తిట్టినా భరిస్తానని, అంతేకాని మోడీని తిడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని పవన్ స్పష్టం చేశారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఊహించినట్లే ఆయన మాటలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది

టీఆర్ఎస్ నేత హరీష్ రావుకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉన్న వ్యాపార సంబంధాల గురించి బయటపెట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసే కేసీఆర్ లాంటి వాళ్లు మనకొద్దని ఆయన అన్నారు. 

మీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా పోటీ చేస్తే దాడులు చేస్తారా? అని కేసీఆర్ ను పవన్ కల్యాణ్ నిలదీశారు. "బూతులు తిడితే కేసీఆర్ కు వచ్చే కిక్కే వేరప్పా" అని 'అత్తారింటికి దారేది' సినిమా స్టయిల్ లో అన్నారు పవన్. తాను మద్దతిచ్చిన నేతలు ప్రజా సమస్యలు పట్టించుకునేలా చూస్తానని పవన్ తెలంగాణ ప్రజలకు మాటిచ్చారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles