Shobha nagi reddy injured seriously in road accident

Shobha Nagi Reddy injured seriously in road accident, YSRCP Shobha nagi reddy, Bhuma Shobha Nagireddy, met in car accident, Shobha Nagi Reddy

Shobha Nagi Reddy injured seriously in road accident, YSRCP Shobha nagi reddy, Bhuma Shobha Nagireddy, met in car accident, Shobha Nagi Reddy

కోమాలో శోభానాగి రెడ్డి - పరిస్థితి విషమం

Posted: 04/24/2014 09:43 AM IST
Shobha nagi reddy injured seriously in road accident

వైయస్సార్ సీపీ పార్టీ నాయకురాలు, ఆళ్ళగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో నంద్యాలలో షర్మిళ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని అనంతరం అవనిగడ్డకు తిరిగి వస్తుండగా ఆళ్లగడ్డ మండలం గూబగుండం మిట్ట వద్ద రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల్ని తప్పించేందుకు ప్రయత్నించడంతో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి నాలుగు పల్టీలు కొట్టింది.

ఈ సమయంలో శోభా నాగిరెడ్డి కారులోంచి బయట పడటంతో ఆమె తలకు, ప్రక్కటెములకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన తరువాత  హుటాహుటిన నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఈమెను పరీక్షించిన వైద్యులు శోభానాగిరెడ్డికి పక్కటెముకలు విరిగాయని, ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని, ప్రస్తుతం శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా కష్టమౌవుతుండటంతో వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈమె కోమాలో ఉన్నదని, ముక్కు, చెవుల్లోంచి రక్తం వచ్చినట్లు ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు తెలపడంతో మెదడులో ఏమైనా గాయాలు ఉన్నాయేమోనని ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన స్కానింగులు చేస్తే గానీ చెప్పలేం అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త భూమా నాగిరెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు కేర్ ఆసుపత్రికి తరలివస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles