Pawan modi chandrababu public meeting in lb stadium

pawan kalyan, narendra modi, chandrababu naidu, tdp, bjp, janasena party, ublic Meeting in LB stadium, bjp meeting in hyderabad.

Pawan Modi Chandrababu Public Meeting in LB stadium

ఒకే వేదికపై ఆశీనులైన మోడీ, చంద్రబాబు, పవన్..

Posted: 04/22/2014 09:17 PM IST
Pawan modi chandrababu public meeting in lb stadium

హైదరాబాదులోని ఎల్బీ స్టీడియంలో ఓ అద్భుత సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై ఆసీనులయ్యారు. సభావేదికపై మోడీ మధ్యలో కూర్చోగా, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కూర్చున్నారు. ఎల్బీ స్టేడియం బీజేపీ, టీడీపీ కార్యకర్తలతో కిక్కిరిసి పోయింది. స్టేడియంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ముగ్గురు కెమిస్ట్రీ అదిరింది

పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ  కాంబినేషన్ అదిరింది. ఇక లెక్కల్లో ఒకటి, ఒకటి, ఒకటి కలిస్తే 3 అవుతుందని... కానీ ఇక్కడ ఒకటి, ఒకటి, ఒకటి కలిస్తే 111 అవుతుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పారు. 

ఈ ఎన్నికలంటే లెక్కలు కాదని... బంధాలు, అనుబంధాలు అని తెలిపారు. మోడీ, చంద్రబాబు, పవన్ కెమిస్ట్రీ అద్భుతంగా కలిసిందని కితాబిచ్చుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవని ఆయన తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ కాని, దాని మిత్రపక్షాలు కాని గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అంచనాలు తప్పుతాయని... వారంతా ఏసీ గదుల్లో కూర్చొని ప్రజల నాడిని అంచనా వేస్తున్నారని దుయ్యబట్టారు. విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వస్తాయని చెప్పారు.

విన్ విన్ కాంబినేషన్  

ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోడీ ప్రధాని కావడం ఖాయమనే విషయం అర్థమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తనది, మోడీది విన్ విన్ కాంబినేషన్ అని... కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 

రైతులు బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని తెలిపారు. ఎన్డీఏ, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది కాని, ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

మన్మోహన్ అసమర్థ ప్రధాని అయితే... రాహుల్ గాంధీ అవగాహన లేని నాయకుడని ఎద్దేవా చేశారు. దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

మోసపూరిత మేనిఫెస్టో 

ఎన్డీఏ అధికారంలోకి రాగానే విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పారు. దేశంలో భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో దేశాన్ని, రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని తెలిపారు. 

ఈ దేశాన్ని ఇలాగే వదిలేద్దామా? లేక, అభివృద్ధి చెందాలని కలలు కందామా? అని ప్రశ్నించారు. దేశ ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పాలంటే బలమైన ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరముందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసపూరిత ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిందని అన్నారు. 10 కోట్ల ఉద్యోగాలంటూ ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మోడీ ఆరోపించారు.

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles