Narendra modi speech in nizamabad public meeting

Narendra Modi, pawan kalyan, Narendra Modi Speech In Nizamabad, bjp, janasena party, tdp, bjp public meeting, congress party, telangana, election 2014.

Narendra Modi Speech In Nizamabad Public Meeting

పాపాత్ములైన నేతలను గెలిపిద్దామా? మోడీ

Posted: 04/22/2014 07:43 PM IST
Narendra modi speech in nizamabad public meeting

తెలంగాణలో జరిగే ఎన్నికలు అత్యంత కీలకమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన భారత్ విజయ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన భావోద్వేగాలతో కూడుకున్న ప్రసంగం చేశారు. తెలంగాణ యువకులను ఆకట్టుకొనే విధంగా ఆయన ప్రసంగం కొనసాగింది. ఆయన ప్రసంగంలో ఎప్పటిలాగానే కాంగ్రెస్ విమర్శల వర్షం కురిపించారు. భారత్ మాతాకి జై అంటూ ఆయన ప్రసంగం ప్రారంభించారు. కుటుంబపాలన అత్యంత ప్రమాదకరమైందని పరోక్షంగా కాంగ్రెస్ ను విమర్శించారు.

 దశాబ్దాలుగా తెలంగాణను పక్కన పెట్టిన వారిని ఎన్నుకుంటారా ? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. కేవలం బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందని, ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదన్నారు. 

దీనివల్ల ఎంతో మంది తల్లులకు గర్భశోకం మిగిలిందని, బలిదానాలు చేసుకున్న వారి రుణం తీర్చుకోవాలని సూచించారు. తెలంగాణను ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుందో ఆలోచించుకోవాలంటూనే వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో ఉన్న సమస్యలను బీజేపీ పరిష్కరిస్తుందని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న యువకుల ఉజ్యల భవిష్యత్ బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

అవమానం చేసింది..

 తెలంగాణ నేతలను ఎన్నోసార్లు కాంగ్రెస్ అవమానానికి గురి చేసిందని తెలిపారు. పివి నరసింహ రావు శ్రద్ధాంజలి, వర్ధంతిలకు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ వెళ్లరని పేర్కొన్నారు. సోనియా కుటుంబం పివి కుటుంబాన్ని అవమానించిదన్నారు. మాజీ ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించింది రాహుల్ తండ్రి కాదా అని ప్రశ్నించారు. అలాంటి పాపాత్ములైన నేతలను గెలిపిద్దామా అని మరోసారి ప్రశ్నించారు.

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles