ఈరోజు 12 రాష్ట్రాలలో 121 స్థానాలకు అతిపెద్ద స్థాయిలో పోలింగ్ ప్రారంభమైంది.
2014 ఎన్నికల 5 వ దశలో కర్నాటకలో 28 స్థానాలకు, రాజస్థాన్ లో 20 స్థానాలకు, మహారాష్ట్రలో 19, ఉత్తర్ ప్రదేశ్ లో 11, ఒడిశాలో 11, మధ్య ప్రదేశ్ లో 10, బీహార్ లో 7, పశ్చిమ బెంగాల్ ల 4, ఛత్తీస్ గఢ్ లో 3, జార్ఖండ్ లో 6, జమ్ము కాశ్మీర్ లో 1, మణిపూర్ లో 1 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలలో జరుగుతున్న పోలింగ్ లో ఈ క్రింది నాయకులు పోటీలో ఉన్నారు.
కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప, బళ్ళారి హీరో బి శ్రీరాములు, ఐటి దిగ్గజం ఆధార్ సృష్టికర్త నీలేకని పోటీలో ఉన్నారు.
రాజస్తాన్ నుంచి పోటీలో సచిన్ పైలట్, భాజపా మీద ఆగ్రహంతో స్వతంత్రంగా పోటీచేస్తున్న జస్వంత్ సింగ్, ఒలింపిక్ సిల్వర్ మెడల్ గ్రహీత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఉన్నారు.
మహారాష్ట్ర నుంచి ఎన్నికల బరిలో సీనియర్ నాయకులు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవన్, గోపీనాథ్ ముండేతో పాటు యువనాయకులు సుప్రియ సులే, నీలేష్ నారాయణ్ రానే ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్ లో మేనక గాంధీ పిల్ భట్ నుంచి పోటీ చేస్తూ ఏడవ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోదలచుకున్నారు.
ఒడిశాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్నికల బరిలో ఉన్నారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిరాదిత్య సిందియా పోటీలో ఉన్నారు.
బీహార్ నుంచి ముఖ్యమంత్రి జెడియు అధినేత నితిష్ కుమార్, భాజపా నుండి రామ్ విలాస్ పాశ్వాన్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా, కేంద్ర హోం సెక్రటరీ ఆర్ కె సింగ్, రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె భారతి కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ లో డార్జిలింగ్ నుంచి తృణమూల్ తరఫున ఫుట్ బాల్ ఆటగాడు బైచుంగ్ భూటియా పోటీలో ఉన్నారు.
మావోయిస్ట్ ప్రభావిత ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ పోటీ చేస్తున్నారు.
జమ్ము కాశ్మీర్ లో కేంద్ర మంత్రి గులామ్ నబి ఆజాద్ ఉధమ్ పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more