Ysrcp seemandhra candidates

YSRCP Seemandhra candidates list released, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

YSRCP Seemandhra candidates list released

వైయస్ ఆర్ కాంగ్రెస్ సీమాంధ్ర అభ్యర్థులు

Posted: 04/15/2014 10:44 AM IST
Ysrcp seemandhra candidates

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 2014 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.  ఇందులో 24 లోక్ సభకు, 170 శాసనసభకు పోటీచేసే అభ్యర్థుల పేర్లున్నాయి.  ఇందులో అసెంబ్లీకి 14 మంది మహిళా అభ్యర్తులు, నలుగురు మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు.  లోక్ సభకు ఐదుగురు మహిళా అభ్యర్థులు ఎంపికచెయ్యబడ్డారు.

వైయస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కడప జిల్లాలో పులివెందుల అసెంబ్లీ స్థానానికి, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు.  పాదయాత్రలు ర్యాలీలతో వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న వైయస్ జగన్ సోదరి షర్మిల పేరు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో లేదు. 

ఆమె ఎన్నికలలో పోటీ చెయ్యనని ఎప్పుడో చెప్పారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారినందుకు బహిష్కరించబడ్డ వారందరికీ పార్టీ టికెట్లు ఇవ్వబడ్డాయి.  అభ్యర్థులలో పేరెన్న వారు –

పార్లమెంటు స్థానాలకు- విజయవాడ నుంచి పారిశ్రామకవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్, నర్సారావు పేట నుంచి అల్లా అయోధ్యరామిరెడ్డి, ఏలూరు నుంచి తోట చంద్రశేఖర్, తిరుపతి నుంతి వి.వరప్రసాదరావు, అరకు నుంచి కొత్తపల్లి గీత, మాజీ మంత్రి విశ్వరూప్, జగన్ సమీప బంధువులు వైవి సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి, కడప నుంచి వైయస్ అవినాష్ రెడ్డి, మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారధి,

సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులు అభ్యర్థుల జాబితాలో లేరు కానీ, వాళ్ళ కుమారులు కొణతాల రఘు కి అనకాపల్లి, దాడి రత్నాకర్ విశాఖపట్నం పశ్చిమం నియోజకవర్గాలను సంపాదించుకున్నారు. 

ఇంకా ప్రముఖలలో సిని నటి రోజా, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొత్తపల్లి సుబ్బరాయుడు, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, తమ్మినేని సీతారాం, జ్యోతులకు పార్టీ టికెట్ లు లభించాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, దేశాయ్ తిప్పారెడ్డి కూడా టికెట్లు సంపాదించారు. 

త్వరలో విడుదల కానున్న రెండవ జాబితాలో బాపట్ల పార్లమెంటు స్థానానికి, పి గన్నవరం, అచంట, పాలకొల్లు, సంతనూతులపాడు మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు వెల్లడికాబోతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles