Priyanka gandhi keen on contesting against modi

Priyanka Gandhi keen on contesting against Modi, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Priyanka Gandhi keen on contesting against Modi

మోదీపై పోటీకి ఉవ్విళ్ళూరుతున్న ప్రియాంకా!

Posted: 04/14/2014 08:58 AM IST
Priyanka gandhi keen on contesting against modi

సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ ఇంతవరకు రాజకీయాలలో ప్రమేయాన్ని కలిగించుకుంటే అది కేవలం తన సోదరుడు రాహుల్ గాంధీ తరఫున ప్రచారం చెయ్యటం కోసమే కానీ ప్రత్యక్ష రాజకీయాలలో ఆమె ఆసక్తిని కనబరచలేదు.

కానీ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ప్రభంజనం చూసి కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వాలన్న ఉద్దేశ్యంలో ప్రియాంకా గాంధీ మోదీకి పోటీగా వారణాసి నుంచి పోటీ చెయ్యటానికి సిద్ధపడ్డటమే కాదు అత్యంత ఉత్సాహాన్ని చూపించారు.  

దేశాభివృద్ధికి మోదీ అడ్డన్న భావన లోతుగా నాటుకునిపోయిన ప్రియాంకా గాంధీ వారణాసి లోక్ సభకు పోటీ చెయ్యాలన్న కోరికను బలంగా వినిపించారు.  ప్రియాంక రాజకీయాలలో ఆసక్తి చూపించటం వలన కాంగ్రెస్ నేతలలో ఉత్సాహం పెరిగిపోతుందన్నది వాస్తవం.  ప్రియాంకా ఒకవేళ ఓడిపోయినా, ఆ విషయం తెలిసేది ఎన్నికల తర్వాత కాబట్టి, ప్రస్తుతం ఎన్నకలలో పోటీ చెయ్యటానికే వెనకాడుతున్న నాయకులు ప్రియాంక వలన ధైర్యం పుంజుకుంటారనటంలో అతిశయోక్తి లేదు.  మోదీ ప్రియాంకాల ఎన్నికల పోటీ ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ ని తలపించవచ్చేమో కానీ బాగా ఆలోచించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా కోరికను కాదంటూ నిర్ణయం తీసుకుంది.  అందుకు కారణాలు ఇవి-
ప్రియాంకా ప్రమేయం వలన కాంగ్రెస్ పార్టీ మోదీకి మరీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లుగా సంకేతాలనిచ్చే ప్రమాదం ఉంది.  మోదీకి అంత వేవ్ లేదు అంటూ చెప్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రియాంకా సెంటిమెంట్ ని ఖర్చు పెట్టటానికి ఇష్టపడటం లేదు.  

ప్రియాంకా ఓడినట్లయితే అది కాంగ్రెస్ పార్టీకి మరింత అప్రతిష్టను తెచ్చి పార్టీకీ నష్టం చేస్తుంది.  

అన్నిటికన్నా బలమైన కారణం ప్రియాంకా వలన రాహుల్ గాంధీ తెరమరుగవవచ్చు.  ప్రియాంకా చలాకీతనం, జనాకర్షణ వలన కాంగ్రెస్ పార్టీకి వారసుడిగా చెయ్యాలనుకున్న రాహుల్ గాంధీని పక్కకు నెట్టేయటం జరగవచ్చు.  అదిపార్టీకి కోలుకోలేని నష్టమౌతుంది.  ఆమె ఆకర్షణ రాహుల్ పాలిట శాపం కావొచ్చు.  అందుచేత కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా ఉత్సాహం మీద నీళ్ళు చల్లవలసివచ్చింది.

పార్టీ ప్రయోజనంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు మరి.  పెద్దమ్మాయి పెళ్ళిచూపులు జరుగుతున్న సమయంలో అంతకంటే చలాకీగా ఉన్న చిన్న కూతురుని అందరి ముందుకూ, ముఖ్యంగా పెళ్ళి కొడుకు ముందకు రానివ్వకపోవటం పెద్ద కూతురు వివాహం దృష్ట్యా సబబే.  రాహుల్ గాంధీకి పట్టం కట్టే ప్రణాళికలో ప్రియాంకా గాంధీ ప్రతిబంధకమయ్యే అవకాశం ఉంది.  

దాని ముందు  మోదీని ఓడించటమనేది చాలా చిన్న విషయం.  పైగా ఆయన గుజరాత్ లో వడోదర నుంచి కూడా పోటీ చేస్తున్నారాయె.  ప్రియాంకా మోదీని ఓడించ గలిగినా రెండు చోట్లా ఆ పని చెయ్యలేదుగా!

ok

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles