Book on pm weaknesses

Book on PM Weaknesses, PM former media adviser Sanjay Baru, Accidental Prime Minister book, Sonia controlling PMO

Book on PM Weaknesses, PM former media adviser Sanjay Baru, Accidental Prime Minister book, Sonia controlling PMO

ప్రధానమంత్రి బలహీనతల మీద పుస్తకం

Posted: 04/12/2014 03:56 PM IST
Book on pm weaknesses

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర 2004 నుంచి 2008 వరకు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం "యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్" శుక్రవారంనాడు విడుదలై రకరకాల సంచలన వ్యాఖ్యానాలకు తావిచ్చింది. 

మన్మోహన్ సింగ్ కి సన్నిహితంగా పనిచేసిన బారు రాసిన విషయాలలో ఎన్నో అంశాలు ఆసక్తికరంగా ఉండటానికి అసలు కారణం అంత వివరంగా తెలియకపోయినా సారాంశం అందరూ ఊహిస్తున్నది అవటమే!  అదేమిటంటే నడిపిస్తున్నదంతా సోనియా గాంధీయే, మన్మోహన్ సింగ్ కేవలం నిమిత్తమాత్రుడే అన్నదాన్ని ఆ పుస్తకంలో సవివరంగా సహేతుకంగా రాసారు బారు.

బారు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఒక కాలంలో రాస్తుండేవారు, ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ కి సంపాదకుడిగా పనిచేసారు.  సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ అందులో మూడ దశలు అయిపోయిన సందర్భంలో వెలివడిన ఈ పుస్తకంలోని అంశాలు ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీకి బాగా ఉపయోగపడుతున్నాయి. 

కేంద్రలో రెండు కేంద్ర బిందువులుగా ఉన్న అధికారం వలన యుపిఏ ప్రభుత్వం నిర్వీర్యమైపోయిందని, రెండు సమాంతరమైన అధికారాలున్నందువలన మన్మోహన్ సింగ్ ఏమీ చెయ్యలేక, జరుగుతున్న అవినీతిని చూసీచూడకుండా ఉండిపోయారని విమర్శలు వస్తున్నాయి.  రెండు ప్రధాన కేంద్రాలుగా ఉండటం తగదని, అలా ఉన్నందువలనే సంక్షోభం ఏర్పడుతోందని, పార్టీ అధ్యక్షురాలే అసలు కేంద్రబిందువని, తను శరణాగతి అవుతున్నానని మన్మోహన్ సింగ్ తనతో అన్నారని బారు తన పుస్తకంలో రాసారు. 

మన్మోహని సింగ్ పార్టీ ఒత్తిడికి లొంగి పనిచేసారని, సోనియా రాహుల్ గాంధీ ఆయన మీద పెత్తనం చెలాయించే బాస్ లు అయ్యారని రాసారు బారు.  ఎన్ఆర్ఇజిఎస్ నిజానికి మన్మోహన్ సింగ్ కి గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన రఘువంశ ప్రసాద్ కి దక్కాలని అయితే దాని ఘనత రాహుల్ గాంధీకి దక్కేలా పార్టీ ప్రణాళికలు వేసిందని బారు తెలియజేసారు. 

అయితే ప్రధాని కార్యాలయం అదంతా ఒట్టిదేనని కొట్టివేస్తోంది.  ఆ పుస్తకంలో రాసిన విషయమంతా ఊహాగానమని తప్పులతడకని, పూర్తిగా కల్పితకథని అభివర్ణిస్తోంది.  కానీ ప్రధాని కార్యాలయం కాదని చెప్పేదానికంటే బారు పుస్తకంలో రాసిన వాటిమీద నమ్మకమే బాగా కలుగుతోంది.  ఎందుకంటే ప్రధాని కార్యాలయం నుంచి వచ్చేదంతా సోనియా గాంధీ అభిప్రాయమే కానీ మన్మోహన్ సింగ్ ది కాదు.  అక్కడ పనిచేసేవారంతా సోనియా గాంధీకోసం పనిచేసేవారే కానీ ప్రధానమంత్రి కోసం కాదు.  ప్రిన్సిపాల్ సెక్రటరి పులోక్ చటర్జీ, మీడియా సలహాదారు పంకజ్ పంచూరీ కూడా ప్రధానమంత్రికి కాకుండా సోనియా గాంధీకి విధేయులని పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. 

బారు పుస్తకంలో సోనియా గాంధీయే ప్రధానమంత్రి కార్యాలయాన్ని నియంత్రిస్తున్నట్లుగా రాసారు.  అయితే ఇది, ప్రధానమంత్రి, సోనియా గాంధీ అనే రెండు అధికార కేంద్ర బిందువులున్నాయనే సిద్ధాంతాన్ని కొట్టిపారేస్తున్నాయి.  ఎందుకంటే ఉన్నది ఒకటే అది సోనియా గాంధీదే.  సోనియా గాంధీ పులోక్ చటర్జీ ద్వారా క్యాబినెట్ వ్యవస్థను, వాళ్ళు కాపాడవలసిన గోప్యతను అపహాస్యం చేస్తున్నారని బారు విమర్శించారు.  ప్రధానమంత్రి కార్యాలయంలో పులోక్ చటర్జీని నియమించిన సోనియా గాంధీతో ఆయన దాదాపూ ప్రతిరోజూ భేటీ అవుతూ రహస్యాలన్నీ చేరవేస్తున్నారుని కూడా బారు తన పుస్తకంలో రాసారు.  దానితో ఏ ఫైళ్ళను ప్రధాన మంత్రి క్లియర్ చెయ్యాలన్నిది కూడా ఆమె నిర్ణయించటం జరుగుతోందని కూడా బారు పుస్తకంలో రాసివుంది.  చటర్జీ ద్వారా సోనియాగాంధీ ప్రదానమంత్రి కార్యాలయంలో జరిగావాటి మీద నిఘా పెడుతున్నారని, ప్రధానమంత్రి కార్యాలయం కేవలం సోనియా గాంధీకి శాఖా కార్యాలయంగా మారిందని బారు రాసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles