Kcr gets rivalry from own party for medak mp seat

KCR gets rivalry from own party for Medak MP seat, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

KCR gets rivalry from own party for Medak MP seat

కెసిఆర్ కి స్వాగతం చెప్పి మరీ పోటీకి దిగిన తెరాస నాయకుడు

Posted: 04/10/2014 07:54 AM IST
Kcr gets rivalry from own party for medak mp seat

నామినేషన్ దాఖలు చెయ్యటానికి బుధవారం ఆఖరి రోజు కావటంతో ఆ రోజు అంతటా హడావిడిగా కలెక్టరేట్లకు చేరుకునేవారి సంఖ్య ఎక్కువైంది.  పోనీ నామినేషన్ రెండు రోజులు ముందే వేద్దామంటే పొత్తుల వలన, ఇతర పార్టీల అభ్యర్థుల వివరాలు తెలియక అభ్యర్థుల జాబితాలు విడుదల చెయ్యటంలో జాప్యం జరిగింది.  దానితో సర్వత్రా వేగిరిపాటు కనిపించింది. 

మెదక్ లో ఎంపీ స్థానానికి, గజ్వేల్ లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్సైన సంగారెడ్డి లో హెలికాప్టర్ లో దిగగానే తెరాస జిల్లా నాయకుడు కుడుబీరయ్య యాదవ్ కెసిఆర్ కి స్వాగతం పలికారు.

గురువులకు ముందు నమస్కార బాణం వేసి తరువాత యుద్ధానికి ఉపక్రమించినట్లుగా కుడుబీరయ్య యాదవ్ ఆ తర్వాత మెదక్ నుంచి పోటీ చెయ్యటానికి నామినేషన్ దాఖలు చేసారు.  అదేమిటని ఆరా తీస్తే, ఈ మధ్యకాలంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తెరాస ఆయనకు జడ్పీటిసి టికెట్ ఇవ్వలేదట.  ఆ అసంతృప్తి ఆయన ఈ విధంగా వెళ్ళగక్కుకున్నారు.

కెసిఆర్, ఇతర నాయకుల ఆదేశాలతో కుడుబీరయ్య యాదవ్ తో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా సమాచారం.  ఆయనను బుజ్జగించి నామినేషన్ ని ఉపసంహరించుకునేట్లుగా అంగీకరింపజేయటానికి మాటలు జరుగుతున్నాయట. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles