Ultimately mamata banerjee bows to ec

Ultimately Mamata Banerjee bows to EC, Election commission of India, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Ultimately Mamata Banerjee bows to EC

మొత్తానికి మెత్తబడ్డ మమత!

Posted: 04/09/2014 07:52 AM IST
Ultimately mamata banerjee bows to ec

ఎన్నికల కమిషన్ సిఫారస్ చేసిన బదిలీలకు భగ్గుమన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మొత్తానికి మెత్తబడ్డారు. 

7 వ తేదీన ఐదుగురు జిల్లా పోలీసు అధికారులు, ముగ్గురు మేజిస్ట్రేట్ లను బదిలీ చెయ్యవలసిందిగా కోరిన ఎన్నికల కమిషన్ కి వ్యతిరేకంగా పట్టుదలతో ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆ బదిలీలు చెయ్యనివ్వనని, ఏం చేసుకుంటే అది చేసుకోమని అన్నారు మమత.  కానీ ఆ తర్వాత అలా ఇసి ఆదేశాలను పాటించని పక్షంలో ప్రధాన కార్యదర్శిని బర్తరఫ్ చెయ్యటానికి, ఎన్నికలను వాయిదా వేయటానికి సిద్ధపడ్డ సంకేతాలు ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి రావటమే కాకుండా రాజ్యాంగ పరమైన అధికారాలు కూడా అర్థమవటంతో 9 వ తేదీ సాయంత్రానికల్లా తన ఆవేశాన్ని తగ్గించుకుని, పున పరిశీలనకు ఎన్నికల కమిషన్ ని కోరారు.

ఎన్నికల కమిషన్ డైరెక్టర్ ధీరేంద్ర ఓజా మాట్లాడుతూ, బదిలీల విషయంలో 7 వ తేదీన ఇచ్చిన ఆదేశాల విషయంలో వివరణ కోరుతూ పున పరిశీలన చెయ్యమని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, అదే విధంగా పున పరిశీలన చేసిన తర్వాత 7 న ఇచ్చిన ఆదేశాలకే కట్టుబడి వుండాలని, 9 వ తేదీ ఉదయం 10.00 గంటలకల్లా వాటిని అమలు పరచాలన్న నిర్ణయం తీసుకున్నామని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసామని చెప్పారు.

విధిలేక అలా చెయ్యటానికి అంగీకరించిన మమత బెనర్జీ, దీన్ని ఎన్నికల కమిషన్ ఆదేశాలుగా తీసుకోవటం లేదని, రాజ్యాంగ పరమైన బాధ్యతగా తీసుకుంటున్నామని, తొలగించిన అధికారులను ఎన్నికలవగానే తిరిగి అవే స్థానాలలోకి విధులలోకి పంపించవలసి వుంటుందని చెప్పి తన గౌరవాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేసారు. 

బంకురా, పురూలియా జిల్లాలలో ర్యాలీ నిర్వహించిన సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలమీద నిప్పులు చెరిగిన మమతా, పశ్చిమ బెంగాల్ చాలా సున్నితమైన ప్రదేశమని, ఐఎస్ఐ చాలా చురుగ్గా పనిచేస్తున్నారని, మావోయిస్ట్ లకు కమ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ లాంటి ఉద్యమ సంస్థలకు రెచ్చిపోయే అవకాశం ఉందని, అందువలన రాష్ట్రంలో జరగరానిది ఏమైనా జరిగితే దాని బాధ్యతను ఎన్నికల కమిషన్ వహించవలసివస్తుందని అన్నారు. 

ఎన్నికల కమిషన్ నే కాకుండా కేంద్రంలో ఉండి వివిధ విభాగాలను తన మీదకు ఉసిగొలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ని కూడా మమత తూలనాడారు.  అయితే ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పార్టీలైన భాజపా, సిపిఐ(ఎమ్) కూడా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మమత బెనర్జీ మీద షో కాజ్ నోటీస్ జారీ చెయ్యాలని, ఆమెను అరెస్ట్ చెయ్యాలని ప్రకటించారు.

మొత్తానికి, పైకి ఏమన్నా ఏ కారణం చెప్పినా, ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజ్యాంగపరమైన అధికారాలుగల ఎన్నికల కమిషన్ దే పై చెయ్యి అయింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles